రష్మి గౌతమ్‌కు బిగ్‌బాస్ శివాజీ షాక్.. ఆ షోకి యాంకర్‌గా1

టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎందరో సీనియర్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఇతర టెక్నీషియన్లు రకరకాల కారణాలతో ప్రేక్షకులకు దూరమయ్యారు. అలాంటి వారంతా రీసెంట్‌గా తమ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సీనియర్లకు డిమాండ్ పెరిగింది. ఇక బుల్లితెరపై రియాలిటీ షోలు, స్పెషల్ ప్రోగ్రామ్స్‌కు జడ్జిలుగా ఉండేందుకు పలు ఛానెల్స్, ఓటీటీ ఫ్లాట్ ఫాంలు వీరికి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ కూడా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారట. ఆ సంగతేంటో చూస్తే :

జెమిని టీవీలో ఎడిటర్‌గా కెరీర్ ప్రారంభించిన శివాజీ ఫ్రెండ్ క్యారెక్టర్లు, ఇతర సహాయక పాత్రలు చేస్తూ హీరో స్థాయికి ఎదిగాడు. అమ్మాయి బాగుంది, వైఫ్, మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, ఒట్టేసి చెబుతున్నా, శ్రీరామచంద్రులు, టాటా బిర్లా మధ్యలో లైలా, శివరామరాజు వంటి సినిమాలు శివాజీకి మంచి పేరు తీసుకొచ్చాయి. అలా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ సాగుతున్న దశలో ఎందుకో ఆయన సిల్వర్ స్క్రీన్‌కు దూరమయ్యారు.

bigg boss contestant and hero Sivaji to become a judge in top entertainment channel here s the details

శివాజీ అనూహ్యంగా రాజకీయాల్లో వేలుపెట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గళమెత్తాడు. అమరావతి, పోలవరం తదితర అంశాలపై తన వాయిస్ బలంగా వినిపించాడు కూడా. పలు ఛానెల్స్ నిర్వహించిన డిబేట్‌లలోనూ శివాజీ పాల్గొని ప్రత్యర్ధులకు స్ట్రాంగ్ కౌంటరిచ్చేవారు. రాజకీయాలకి కూడా బ్రేక్ ఇచ్చి బిగ్‌బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చాడు.

వయసు, పాపులారిటీ నేపథ్యంలో శివాజీ త్వరగానే హౌస్ నుంచి వచ్చేస్తాడన్న వారి చేత అపర చాణక్యుడు అనిపించుకున్నాడు. బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌తో వరుస అవకాశాలు శివాజీ ఇంటి ముందు క్యూకట్టాయి. తాజాగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ''జై జై గణేశా '' పేరుతో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, ఇంద్రజలతో పాటు శివాజీ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఖుష్బూని బిగ్‌బాస్ మహారాణిగా, ఇంద్రజను శ్రీదేవి డ్రామా కంపెనీ యువరాణి అంటూ పొగిడెస్తాడు.

bigg boss contestant and hero Sivaji to become a judge in top entertainment channel here s the details

రష్మీ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని చెప్పి నవ్వించిన శివాజీ మరో బాంబు పేల్చాడు. మా ముగ్గురిని పిలిచి మీరు లేట్‌గా ఎందుకొచ్చారని రష్మీ అడగ్గా.. తాను లేట్‌గా రాలేదని, టైమొచ్చింది వచ్చానంటూ పంచ్ డైలాగ్ పేల్చాడు. ఆ వెంటనే మన ఈటీవీలో ప్రసారమయ్యే ఒక ప్రోగ్రామ్‌కి జడ్జిగా రాబోతున్నానని చెప్పడంతో ఇంద్రజ, ఖుష్బులు ఎక్కడ తమ పోస్టులకు ఎసరు పెడతాడోనంటూ షాకవుతారు. దీనికి రష్మి .. హమ్మయ్య, జడ్జిగానే కదా నేను సేఫ్ అంటుంది.

అది జడ్జా, లేదంటే యాంకరా అని శివాజీ చెప్పబోతుండగా .. ఇంతకీ ఏ షోకి వస్తున్నారో నాకయినా చెప్పొచ్చుగా అని ఇంద్రజ, ఖుష్బూలు అడుగుతారు. దానికి తర్వాత చెబుతానని శివాజీ ఆన్సర్ ఇస్తాడు. మరి శివాజీ ఏ షోకి జడ్జిగా లేదంటే యాంకర్‌గా రాబోతున్నాడా తెలియాలంటే ఈటీవీలో వినాయక చవితి సంబరాలు చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: anchor rashmi hero sivaji
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X