గార్డెన్‌లో హద్దు మీరిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఆ స్పాట్‌లో పూల గుత్తి పెట్టి అరాచకం!

సోషల్ మీడియా రాకతో రాత్రికి రాత్రి స్టార్లుగా మారినవారు ఇండియాలో ఎంతో మంది ఉన్నారు. నాలుగు గోడలకే పరిమితమైన తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సోషల్ మీడియా వారికి వేదికగా మారింది. ఇలాంటి వారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా యూత్‌లో క్రేజ్ దక్కించుకున్నారు. సినిమాలలో, సీరియల్స్‌లో, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. వీరిని చూసి మరింత మంది సోషల్ మీడియా ద్వారా పైకొస్తున్నారు.

ఇలాంటి వారిలో అశ్వినీ శ్రీ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు ద్వారా ఈమె జనంలో బాగా పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈమె తన అందాలతో రెచ్చగొట్టారు . బిగ్‌బాస్ తెలుగు 7 షో లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో అర్జున్ అంబటి, భోలే షావలి, నయనీ పావనీ, పూజా మూర్తీతో పాటు అశ్వినీ శ్రీ కూడా ఉన్నారు. తన క్యూట్ లుక్స్ , భారీ అందాలతో ఆకట్టుకున్న అశ్వినీ శ్రీ ఎవరు? ఆమె ఫ్యామిలీ నేపథ్యం ఏమిటీ? బిగ్‌బాస్ తెలుగు ఆఫర్ ఎలా అందుకున్నారు? అంటూ తన గురించి అప్పట్లో నెటిజన్లు తీవ్రంగా శోధించారు.

bigg boss contestant ashwinii sree adorable Photoshoot goes viral

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అశ్వినీ శ్రీ.. వరంగల్ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతిభావంతురాలు. సోషల్ మీడియాలో డబ్‌స్మాష్, రీల్స్‌తో పాపులరైన అశ్వినీ శ్రీకి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ పాపులారిటీతో సినీరంగంలో అడుగుపెట్టిన అశ్విని వినోదం 100 % , బీటెక్ బాబులు, అమీర్‌పేట, సరిలేరు నీకెవ్వరు, సర్దార్ గబ్బర్ సింగ్, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో నటించారు. అలాగే పలు మ్యూజిక్ ఆల్బమ్స్, సీరియల్స్‌లోనూ కనిపించి ఆకట్టుకున్నారు. అశ్వినీ శ్రీ తండ్రికి ఆమె సినీరంగం వైపు వెళ్లడం ఇష్టం లేదు. ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చదువుకుని మంచి ఉద్యోగం చేరి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అశ్వినీ తండ్రి చెప్పేవారట.

ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా ఎంటర్‌టైనింగ్ రంగం వైపు అడుగులు వేసిన అశ్విని సక్సెస్ కొట్టారు. బిగ్‌బాస్‌ తెలుగులో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆమ ఎవ్వరితోనూ కలవలేకపోయారు. గేమ్స్‌లోనూ సత్తా చాటలేకపోయిన అశ్విని .. ఆడియన్స్ దయ చూపడంతో నామినేషన్స్‌లో సేవ్ అవుతూ వచ్చారు . అయితే 12వ వారంలో సెల్ఫ్ నామినేషన్ వేసుకున్న అశ్విని తనకు తాను వెన్నుపోటు పోడుచుకుంది. మొత్తంగా ఏడు వారాల పాటు బిగ్‌బాస్‌లో ఉన్న అశ్విని వారానికి రూ.2 లక్షల చొప్పున దాదాపు రూ.14 లక్షలకు పైగా పారితోషికం అందుకుందని టాక్.

బిగ్‌బాస్ తర్వాత వచ్చిన ఫేమ్‌తో పలు సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకున్నారు అశ్వినీ శ్రీ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అశ్విని .. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, ఇతర వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటారు. తాజాగా పొట్టి బట్టలు వేసుకుని గార్డెన్‌లో అందాలు ఆరబోశారు అశ్విని. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X