క్లోజ్‌లో నాభి అందాలు చూపిస్తూ .. హంపి శిల్పాల మధ్యలో బిగ్‌బాస్ అరేబియన్ గుర్రం
భారతదేశంలో మెగా రియాలిటీ షోగా గుర్తింపు తబిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అశ్వినీ శ్రీ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈమె తన గ్లామర్‌తో హౌస్‌కి సొగసులు అద్దింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అశ్విని శ్రీ ఎప్పటికప్పుడు వ్యక్తిగత వివరాలు, తన కెరీర్‌కు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7లో భాగంగా కొందరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఘటన జనానికి బాగా గుర్తు. వారిలో అర్జున్ అంబటి, భోలే షవలి, నయనీ పావనీ, పూజా మూర్తీతో పాటు అశ్వినీ శ్రీ కూడా హౌస్‌లో అడుగుపెట్టారు. తన క్యూట్ లుక్స్ , భారీ అందాలతో ఆకట్టుకున్న అశ్వినీ గురించి అప్పట్లో నెటిజన్లు తీవ్రంగా శోధించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అశ్వినీ శ్రీ.. వరంగల్ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

సోషల్ మీడియాలో డబ్స్‌మాష్, రీల్స్‌తో పాపులరైన అశ్వినీ శ్రీ పలు సినిమాల్లోనూ నటించారు. వినోదం 100 % , బీటెక్ బాబులు, అమీర్‌పేట వంటి సినిమాల్లో ఆమె మెరిశారు. అలాగే పలు మ్యూజిక్ ఆల్బమ్స్, సీరియల్స్‌లోనూ కనిపించి ఆకట్టుకున్నారు. నిజానికి ఆమె కుటుంబ సభ్యులకు , ముఖ్యంగా తండ్రికి అశ్వినీ శ్రీ యాక్టర్ కావడం ఇష్టం లేదు. ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చదువుకుని యాక్టర్ కావడం ఏంటని పలుమార్లు ఆయన అడిగినట్లు అశ్వినీ శ్రీ చెప్పారు.
బిగ్‌బాస్ తర్వాత వచ్చిన ఫేమ్‌తో పలు సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకున్నారు అశ్వినీ శ్రీ. తాజాగా ఆమె లీడ్ రోల్‌లో ఓ సినిమా ప్రారంభమైంది. మిస్ జానకి అనే ఈ చిత్రానికి సతీష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. నాగరాజు నెక్కంటి నిర్మిస్తున్నారు. డీజే టిల్లులో రాధిక తరహా పాత్ర మాదిరిగా తన క్యారెక్టర్ ఉంటుందని అశ్వినీ తెలిపారు. ఈ సినిమాలో తాను చేసే క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుందని చెప్పారు. తనికెళ్ల భరణి, అలీ, చిత్రం శ్రీను, మహేశ్ కుమార్, లోబో, బిగ్‌బాస్ శాని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం అశ్వినీ శ్రీ కర్ణాటకలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లలో ఒకటైన హంపి వెకేషన్‌లో ఉన్నారు. అక్కడి విజయనగర సామ్రాజ్య శిథిలాలను చూస్తు చరిత్రను తెలుసుకుంటున్నారు. విరూపక్ష ఆలయాన్ని దర్శించిన అశ్విని గోల్డ్ కలర్ శారీలో, నెక్ బ్లౌజ్ వేసి అందాల విందు చేస్తున్నారు. ఓ రాయిపై కూర్చొని నాభి అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఇంకేందుకు ఆలస్యం ఈ అందాలు మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











