బిగ్ బాస్ కంటెస్టెంట్ పై అర్ధరాత్రి దాడి.. తీవ్ర గాయాలు.. వీడియో వైరల్!
అర్ధరాత్రి ఓ బాలీవుడ్ సెలబ్రెటీపై దాడి చేసిన ఘటన అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. తీవ్రంగా గాయాల పాలైన అతను ప్రస్తుతం బాగానే ఉన్నాను అంటూ వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అతను మరెవరో కాదు హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో మంచి క్రేజ్ అందుకున్న అసిమ్ రియాజ్.

బిగ్ బాస్ తోనే భారీగా క్రేజ్
గత ఏడాది సెప్టెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు కొనసాగిన బిగ్ బాస్ షోలో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి మంచి క్రేజ్ దక్కింది. అందులో అసిమ్ రియాజ్ ఒకరు. అసిమ్ టైటిల్ గెలవడానికి చివరి వరకు కూడా ఎంతగానో పోరాడాడు. అయితే చివరి వీక్ లో అతను చేసిన కొన్ని మిస్టక్స్ టైటిల్ మిస్సయ్యేలా చేశాయి. ఫస్ట్ రన్నరప్ గా నిలిచి భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్ లో సిద్దార్థ్ శుక్లా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అర్ధరాత్రి దాడి..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. తనపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని అసిమ్ రియాజ్ వీడియో విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. సైకిల్ పై వెళుతుండగా కొందరు బైక్ పై వచ్చి వెనకాల నుంచి గట్టిగా కొట్టారని ఆ దెబ్బకు తాను క్రింద పడ్డానని చెప్పాడు. అనంతరం వారి వల్ల అయిన గాయలని కూడా చూపించాడు రియాజ్.
తీవ్ర గాయాలు
భుజం దగ్గర అలాగే మోకాళ్ళ వద్ద తీవ్రమైన గాయం అయినట్లు చెబుతూ రక్త కూడా పోయినట్లు తెలిపాడు. రియాజ్ పై జరిగిన దాడిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భారీ స్థాయిలో స్పందించారు. రియాజ్ వెంటనే కొలుకోవలని కోరుకుంటూ వాళ్ళు నెక్స్ట్ టైమ్ కనిపిస్తే ఏ మాత్రం వదలవద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

త్వరలో కథానాయకుడిగా
ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పిన రియాజ్ వీలైనంత త్వరగా కొలుకోవడానికి ప్రయత్నం చేస్తానని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఇక పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించిన రియాజ్ త్వరలో కథానాయకుడిగా స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ రావడంతో ఆడియెన్స్ ని మెప్పించే సినిమాలు మాత్రమే చేస్తానని అసిమ్ గత ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











