Bigg Boss Show గంగవ్వ మాదిరిగా మరో కంటెస్టెట్ అవుట్.. అనారోగ్యం, మానసికంగా కుంగిపోవడంతో బయటకు!

బిగ్‌బాస్ రియాలిటీ షో రసవత్తరంగా సాగుతున్నాయి. తెలుగులో ఈ రియాలిటీ షో 6వ వారంలోకి చేరితే.. తమిళంలో ఒకవారం ముగిసిపోయింది. తాజాగా కన్నడ భాషలో అక్టోబర్ 8వ తేదీన బిగ్‌బాస్ కన్నడ అట్టహాసంగా మొదలైంది. అయితే ఇంటిలో నామినేషన్లు, ఎలిమినేషన్లతో ఇంటి సభ్యులు బయటకు పోవడం జరుగుతుంది. కానీ ఆట మధ్యలో ఓ కంటెస్టెంట్ ఆరోగ్య కారణాల వల్ల బయటకు పోవడం అటు అభిమానులను, కంటెస్టెంట్లను, నిర్వాహాకులను ఆందోళనకు గురి చేస్తుంది. తాజా ఓ సీనియర్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ షో నుంచి అర్దాంతరంగా బయటకు పోయిన వివరాల్లోకి వెళితే..

గతంలో తెలుగు బిగ్‌బాస్ షోలో సీనియర్ కంటెస్టెంట్ గంగవ్వ కూడా అలాంటి పరిస్థితిలోనే బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 55 ఏళ్లకుపైగా వయసులో గంగవ్వ బిగ్‌బాస్‌‌లోకి వచ్చి అందర్నీ ఆకట్టుకొన్నది. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో గంగవ్వ కంగారుపడిపోయింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించారు. కానీ ఆమె ఆరోగ్యం కుదటపడకపోవడంతో గంగవ్వ కోరిక మేరకు ఇంటి నుంచి బయటకు వెళ్లడం తెలిసిందే.

Bigg Boss Tamil 7 Logo

అలాంటి సంఘటనే తమిళ బిగ్‌బాస్‌లో చోటు చేసుకొన్నది. ఆట మొదలైన కొద్ది రోజులకే అనారోగ్య కారణాలతో ఇంటి సభ్యులు భవ చెల్లాదురై ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం అందర్నీ ఆవేదనకు గురి చేసింది. బవ చెల్లదురై ఇంటి నుంచి వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన భావోద్వేగంతో ఇంటి నుంచి బయటకు వస్తున్న సన్నివేశం అందర్నీ ఆవేదనకు గురి చేసింది.

బిగ్‌బాస్ తమిళ షో నుంచి భవ చెల్లాదురై ఇంటి నుంచి బయటకు వెళ్తూ.. నేను ఇంటి నుంచి బయటకు త్వరగా వెళ్లి పోవాల్సిన అవసరం వచ్చింది. నా చుట్టు ఉన్న పరిస్థితుల వల్ల ఇంటిని వీడటం తప్పడం లేదు. నా ఆరోగ్యం బాగా లేకపోతే ఇంటి సభ్యులు ఓ తండ్రిని పిల్లలు చూసుకొన్నంతగా ప్రేమతో చూసుకొన్నారు.నేను షోలో ఉంటే బాగుంటుందని అనుకొంటున్న సమయంలో నాకు ఇలా అనారోగ్యం చేయడం బాధగా ఉంది. నా మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని భవ చెల్లాదురై అన్నారు.

Bigg Boss Tamil 7 Contestant Bava Chelladurai quits

భవ చెల్లాదురై గత రెండు వారాలుగా నామినేట్ అవుతూ వస్తున్నారు. తొలివారం నామినేషన్ తర్వాత బిగ్‌బాస్‌లో ఉన్న రెండు హౌస్‌లలో ఆయనను చిన్న ఇంటికి పంపించారు. అలా రెండు వారాలు ఇంటి సభ్యులు నామినేట్ చేయడంతో చెల్లాదురై ఆందోళన చెందారు. నామినేట్ చేస్తున్నారనే విషయం ఆయన మానసిక స్థితిని కుంగదీసింది. దాంతో ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది. దాంతో ఆయన ఇంటిని విడిచి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో బిగ్‌బాస్ కూడా ఆయనను హౌస్ నుంచి బయటకు పంపించారు.

అయితే రెండో వారం తర్వాత ఓ ఇంటి సభ్యుడు అనూహ్యంగా వెళ్లిపోవడంతో మరో కంటెస్టెంట్‌ను తీసుకు వస్తారా? అనే చర్చ మొదలైంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో కంటెస్టెంట్‌ను ఇంటిలోకి తీసుకు వస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఒకరిద్దరి ప్రముఖుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X