బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ బెజవాడ బేబక్క ఎవరి కూతురో తెలుసా? ఆమె అన్న కూడా టాలీవుడ్ నటుడే..
Bigg Boss Telugu 8 Contestant Bezawada Bebakka: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో ఈ సారి సరికొత్త థీమ్‌తో అలరించేందుకు ముందుకు వచ్చింది.ఈ సారి కంటెస్టెంట్స్‌గా హీరోలు, హీరోయిన్లు,టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్, సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్లుగా హౌజ్ లోకి తీసుకవచ్చింది. వారిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్, నటి బెజవాడ బేబక్క ఒక్కరూ. ఆమె బ్యాక్ డ్రాప్ గురించి తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లువడుతున్నాయి. ఆమె అన్నయ్యకు ఇండస్ట్రీతో చాలా దగ్గరి సంబంధాలున్నాయి. ఇక వాళ్ల పెద్ద నాన్న గురించి తెలిస్తే.. మీరు కూడా షాక్ కావాల్సిందే. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
బెజవాడ బేబక్క ఆమె యూట్యూబ్ సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈమె నటిగా, సింగర్‌గా, కమెడియన్‌గా, మిమిక్రీ కళాకారిణిగా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. కరోనా టైంలో తన ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌తో చాలా ఫేమస్ గా మారింది . బేబక్కది మన విజయవాడనే. ఆమె పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. ఆ తరువాత అక్కడే ఉద్యోగం చేస్తూ అమెరికాలో స్థిరపడింది. కరోనా సమయంలో ఉద్యోగం మానేసి.. యాక్టర్ గా అవతారమెత్తింది. ఇప్పటి వందలా షోలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒక్కొక్క షోకు లక్షల్లో సంపాదిస్తున్నారట.

ఆమె ఒక్క యాంకరింగ్ మాత్రమే కాకుండా మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్‌గా, స్టాండప్ కమెడియన్ కూడా. బెజవాడ స్లాగ్‌లో మాట్లాడుతూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే బెజవాడ బేబక్క అసలు పేరు 'మధూ నెక్కంటి'. సమయం దొరికినప్పుడల్లా ఇండియాకి వచ్చి బేబక్క తనలోని టాలెంట్ మొత్తం చూపించింది. ఆమె ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు, 24 కిస్సెస్, ఎబీసీడీ, వంటి చిత్రాల్లో నటించింది. బేబక్క యాకర్ట్ మాత్రమే కాదు. సింగర్ కూడా. ఆమె ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కంపోజింగ్‌లో పలు సాంగ్స్ పాడింది. ఎన్ని చేసినా ఆమెకు ఇప్పటికి సరైన గుర్తింపు రాలేదు. ఇలా ఆమె గురించి తెలుసుకున్న కొద్దీ.. పలు ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి.
పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించిన బేజక్క ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సినీ పరిశ్రమలో బేబక్కకు చాలా దగ్గరి సంబంధాలున్నాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈమెకి స్వయానా పెద్దనాన్న. బేబక్క అమ్మ వాళ్ల అక్కనే రాఘవేంద్రరావు వివాహం చేసకున్నారు. ఇండస్ట్రీతో కూడా ఈమెకి బాగా టచ్ ఉంది. రాఘవేంద్రరావు వారికి రిలేషన్స్ అవుతారనే విషయాన్ని స్వయంగా ఈమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయమేమింటంటే.. బేబక్కకు ఓ అన్నయ్య గా కూడా ఉన్నారు. అతని పేరు వంశీ నెక్కంటి. ఆయన టాలీవుడ్ నటుడు.ఆయన ఖలేజా, వంగవీటి, పుష్ప, రణరంగం వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆమె తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. రియల్ ఎస్టేట్ రంగం రాణించి కోట్లాది రూపాయాలను సంపాదించారు. అయితే..ఈ మధ్యకాలంలో బేబక్క తండ్రి కాలం చేశారట.


Click it and Unblock the Notifications











