వెన్నుపోటుకు బలయ్యా, సంచలన విషయం బయటపెట్టిన బేబక్క
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులరైన బెజవాడ బేబక్క ఆ ఇమేజ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 8లో బెర్త్ సంపాదించారు. తన ఇన్‌స్టాగ్రామ్ , యూట్యూబ్ వీడియోలలో జోక్స్, సెటైర్లు మామాలుగా ఉండవు. కానీ ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు బేబక్క. తద్వారా ఈ సీజన్‌లో హౌస్‌ను వీడిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు. బయటకు వచ్చిన తర్వాత పలు ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బేబక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే:
సోషల్ మీడియాలో లొడలొడ వాగే బేబక్క.. తన చేష్టలతో ప్రేక్షకులను నవ్వించేవారు. అందుకే ఆమె ఇన్‌స్టా, యూట్యూబ్ ఖాతాలకు భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్‌నే హౌస్‌లో కూడా ఇస్తుందని నమ్మి బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెకు సీజన్ 8లో ఛాన్స్ ఇచ్చారు. కానీ బేబక్క నుంచి ఆ స్థాయిలో ఫన్ రాలేదు. కేవలం కిచెన్‌కే పరిమితమై, వాళ్లు ఇలా.. వీళ్లు ఇలా అంటూ చాడీలకే పరిమితమైంది . దీనికి తోడు టాస్క్‌ల్లోనూ ఆమె చాలా వీక్ అని తేలిపోయింది. అంతా తనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. డిఫెన్స్ చేసుకోలేక ఉసూరుమనిపించింది.

సహజంగానే పెద్ద వయసు వాళ్లను బిగ్‌బాస్‌లో ఎక్కువ రోజులు ఉంచరు. బిగ్‌బాస్ తొలి సీజన్ నుంచి ఇదే రూల్ ఫాలో అవుతున్నారు. షకీలా, కిరణ్ రాథోడ్, కరాటే కళ్యాణి, హేమ వంటి వాళ్లు ఈ కోవలోకే వస్తారు. అయితే శివాజీ వంటి వారు దీనికి మినహాయిపు . పెద్ద వయస్కుడే అయినా ఆటను మొత్తం చదివేసి చాణక్యుడిగా అవతరించాడు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే తాము ఎలిమినేట్ చేస్తున్నామని నాగార్జున చెప్పడం జస్ట్ ఓ కవరింగ్ మాత్రమేనని.. బిగ్‌బాస్ నిర్వాహకులదే తుది నిర్ణయమన్నది బహిరంగ రహస్యం. బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభమైన ఫస్ట్ డే నుంచి బేబక్కే ఫస్ట్ వికెట్ అని నెటిజన్లు ఎప్పుడో చెప్పేశారు. చివరికి అదే నిజమైంది.
ఫస్ట్ వీక్‌లో బెజవాడ బేబక్క , విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, శేఖర్ భాషా నామినేషన్స్‌లో ఉండగా ఓటింగ్ ఆధారంగా బేబక్కను ఎలిమనేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. బిగ్‌బాస్‌లో ఉన్నందుకు గాను రెమ్యునరేషన్ కింద రూ.1.30 లక్షలను బేబక్క అందుకున్నట్లుగా సోషల్ మీడియా టాక్. అయితే హౌస్ నుంచి తొలివారమే ఎలిమినేట్ అయినా బిగ్‌బాస్ వల్ల బేబక్కకు ఫాలోవర్లు బాగా పెరిగారు.
బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తోన్న బేబక్క.. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన చలాకీతనం, దూకుడు చూసి రిలేటివ్స్, ఫ్రెండ్స్ నన్ను రాజకీయాల్లోకి వెళ్తమన్నారని ఆమె తెలిపారు. పార్టీలు నీకు టికెట్ ఇస్తాయని, ట్రై చేయాల్సిందిగా చెప్పారని బేబక్క గుర్తుచేశారు. కానీ తనకు ఎత్తులు, పైఎత్తులు వేయడం.. నటించడం రాదన్నారు. అదే వస్తే బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకు ఎలిమినేట్ అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బేబక్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











