రతిక, శోభాశెట్టి దిగదుడుపే.. ఆమె చాలా కన్నింగ్.. బేబక్క షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ వీక్‌ను కంప్లీట్ చేసుకుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమై బెజవాడ బేబక్క హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తద్వారా బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ నుంచి బయటికెళ్లిన తొలి కంటెస్టెంట్‌గా బేబక్క నిలిచారు. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె కీలక విషయాలు పంచుకున్నారు. బేబక్కకు బిగ్‌బాస్‌లో బాగా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరు , హౌస్‌లో ఏ విషయం నచ్చలేదు అనే అంశాలు తెలియజేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులరైన బెజవాడ బేబక్క ఆ ఇమేజ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 8లో బెర్త్ సంపాదించారు. తన ఇన్‌స్టా, యూట్యూబ్ వీడియోలలో జోక్స్, సెటైర్లు మామాలుగా ఉండదు. ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్‌ను హౌస్‌లో కూడా ఇస్తుందని నమ్మి బిగ్‌బాస్‌లోకి తీసుకున్నారు నిర్వాహకులు. కానీ బేబక్క నుంచి ఎలాంటి ఫన్ రాలేదు. కేవలం వంట ఇంటికే పరిమితమై, వాళ్లు ఇలా.. వీళ్లు ఇలా అంటూ చాడీలకే పరిమితమైంది బేబక్క. దీనికి తోడు టాస్క్‌ల్లోనూ ఆమె చాలా వీక్ అని తేలిపోయింది.

bigg boss contestant bezawada bebakka made sensational comments on sonia akula here s the details

సహజంగానే పెద్ద వయసు వాళ్లను బిగ్‌బాస్‌లో ఎక్కువ రోజులు ఉంచరు. బిగ్‌బాస్ తొలి సీజన్ నుంచి ఇదే రూల్ ఫాలో అవుతున్నారు. షకీలా, కిరణ్ రాథోడ్, కరాటే కళ్యాణి, హేమ వంటి వాళ్లు ఈ కోవలోకే వస్తారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే తాము ఎలిమినేట్ చేస్తున్నామని నాగార్జున చెప్పడం జస్ట్ ఓ కవరింగ్ మాత్రమేనని.. బిగ్‌బాస్ నిర్వాహకులదే తుది నిర్ణయమన్నది బహిరంగ రహస్యం. బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభమైన ఫస్ట్ డే నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే ఆడియన్స్ గెస్ చేసేశారు . ఆవిడే బేబక్క.

ఫస్ట్ వీక్‌లో బెజవాడ బేబక్క , విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, శేఖర్ భాషా నామినేషన్స్‌లో ఉండగా ఓటింగ్ ఆధారంగా బేబక్కను ఎలిమనేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఇక బిగ్‌బాస్‌లో ఉన్నందుకు గాను రెమ్యునరేషన్‌గా రూ.1.30 లక్షలు తీసుకున్నట్లుగా సమాచారం. హౌస్ నుంచి తొలివారమే ఎలిమినేట్ అయినా బిగ్‌బాస్ వల్ల బేబక్కకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు పెరిగారు.

బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చిన తర్వాత బేబక్క మీడియాతో మాట్లాడుతూ ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి చెప్పింది. నిఖిల్, సోనియాలు పక్కా ప్లాన్‌తో హౌస్‌లోకి వచ్చారని.. రతిక, శోభాశెట్టిలు సోనియా ముందు దిగదుడుపేనని బేబక్క తెలిపింది. నా సపోర్ట్ విష్ణుప్రియకి, సీత, నైనిక , నబీల్‌కే ఉంటుందని.. వాళ్లు రియల్‌గా ఆడుతున్నారని కాంప్లిమెంట్ ఇచ్చింది. సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఆదిత్య ఓం తన లోకంలో ఉంటున్నారంటూ హింట్ ఇచ్చింది. ప్రస్తుతం బేబక్క వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X