అతని ఫ్యాన్స్ టార్గెట్‌‌ చేశారు .. భయమేస్తోంది, బిగ్‌బాస్ విన్నర్‌పై లేడీ కంటెస్టెంట్ సంచలనం

బిగ్‌బాస్ అంటేనే వివాదాలు, విమర్శలు. ఈ సీజన్ ఎమో కానీ బిగ్‌బాస్ తెలుగు 7 మాత్రం అనేక విమర్శలు, వివాదాలతో పాటు ఏకంగా పోలీసులకు వరకు వెళ్లి ఏకంగా బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. ఫినాలే ముగిసిన రోజున హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనలో బిగ్‌బాస్ తెలుగు 7 రన్నరప్ అమర్‌దీప్ చౌదరి తల్లి, భార్యకు గాయాలయ్యాయి.

నాటి ఘటనలో పల్లవి ప్రశాంత్‌కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించగా.. జైలుకు వెళ్లిన రెండ్రోజులకు బెయిల్ తెచ్చుకున్నాడు. శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీలు లాంటి వాటిలో పాల్గొనకూడదని పోలీసులు ముందే హెచ్చరించగా.. వాటిని బేఖాతరు చేస్తూ విధ్వంసానికి కారణమైనందుకు గాను పోలీసులు పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన బిగ్‌బాస్ షోకే మచ్చగా మారడంతో పాలు పల్లవి ప్రశాంత్‌పైనా విమర్శలు వెల్లువెత్తాయి.

Bigg Boss contestant damini made sensational comments on pallavi prashanth fans

ఇక టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో నిరుపేదలకు సాయం చేస్తానన్న పల్లవి ప్రశాంత్ మాట తప్పినట్లుగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం రూ. 35 లక్షల ప్రైజ్ మనీలో రూ. లక్ష, తర్వాత మరో కుటుంబానికి మరో లక్ష ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే మిగిలిన మొత్తాన్ని ప్రశాంత్ పేదలకు ఖర్చు చేయలేదని కొందరు ఆయనపై విరుచుకుపడుతున్నారు. రీసెంట్‌గా పల్లవి ప్రశాంత్ తన లుక్ కంప్లీట్‌గా మార్చేశాడు. దీంతో హౌస్‌లో ఉన్నప్పుడు సానుభూతి డ్రామా ఆడి.. బయటికి వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఈ సంగతి పక్కనపెడితే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు నానా రచ్చ చేశారు. ఎవరైనా మనోడిని నామినేట్ చేసినా, అతనితో గొడవ పెట్టుకున్నా ఆ కంటెస్టెంట్‌ని సోషల్ మీడియాలో ఏకీపారేసేవారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ అభిమానుల కారణంగా కొందరు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో బిగ్‌బాస్ 7 తెలుగు కంటెస్టెంట్ సింగర్ దామిని కూడా ఉన్నారు.

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హౌస్‌లో ఉన్నప్పుడు ప్రశాంత్ కింద పడుకునే వాడని అది నాకు నచ్చక తనతో అలా చేయొద్దని చెప్పినట్లు దామిని గుర్తుచేసుకున్నారు. మూసుకుని పైన పడుకో అని ముద్దుగా చెప్పేదాన్నని.. మళ్లీ ఈ మాట అంటే నా మీద విరుచుకుపడతారేమోనని ఆమె టెన్షన్ పడ్డారు. దీంతో మీరు భయపడుతున్నారా అని దామినిని ప్రశ్నించగా.. ఔను అని ఆమె ఆన్సర్ ఇచ్చారు.

నా పర్సనల్ పోస్టులలో నీ టాలెంట్ ఎక్కడ, వాడి టాలెంట్ ఎక్కడ, వాడి కాలి గోటికి కూడా సరిపోవని కామెంట్స్ పెడుతున్నారని ఆమె ఆరోపించారు. నవరాత్రికి తాను కొన్ని రీల్స్ చేసుకుంటుంటే నా రీల్స్‌‌పై ఫైట్స్ చేశారని .. ఇంత పర్సనల్‌గా తీసుకుంటే భయం వేయదా అని దామిని ప్రశ్నించారు. అమర్‌దీప్ వాళ్ల అమ్మగారిని కూడా ఇలాగే టార్గెట్ చేసి ఇంత క్షోభ పెట్టాల్సిన అవసరం ఏంటని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం దామిని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: bigg boss pallavi prashanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X