వెల్లకిలా పడుకొని అవి చూపించేసిన బిగ్‌బాస్ బ్యూటీ .. టెంప్టింగ్ ఫోజులతో కవ్వింపులు
సోషల్ మీడియా రాకతో ఎంతోమంది జీవితాలు మారిపోయాయి. టాలెంట్ ఉండి దానిని ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియని ఎంతో మందికి ఇది వేదికలా మారింది. రీల్స్, వీడియోలతో పలువురు ప్రతిభావంతులు తమ టాలెంట్‌ని నిరూపించుకుని ఎన్నో అవకాశాలు పొందారు. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలోని యంగ్ హీరో హీరోయిన్లు చాలా మంది సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఇలాంటి వారిలో దీప్తి సునైన ఒకరు.
యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాద్ అమ్మాయి .. షార్ట్ ఫిలింస్, ఇతర వీడియోలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 2లో ఛాన్స్ కొట్టేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ టైంలో టాస్క్‌లు, గొడవలతో పాటు తన అంద చందాలతో బిగ్‌బాస్ హౌస్‌కి గ్లామర్ అద్దారు దీప్తి సునైనా. ఆ సమయంలో యంగ్ హీరో తనీష్‌తో క్లోజ్‌గా ఉంటూ కాకరేపింది. బిగ్‌బాస్ తర్వాత తెలుగునాట బాగా పాపులర్ అయ్యారు దీప్తి.

యూట్యూబర్, మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ .. చాలా కాలం పాటు అతనితో రిలేషన్ కొనసాగించారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా అనుకుంటున్న దశలో అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడం కలకలం రేపింది. మరీ ముఖ్యంగా షణ్ముఖ్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత అతనితో దీప్తికి బ్రేకప్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. షన్నూతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తోన్న దీప్తి తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేశారు.
రీల్స్, షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ ఆల్బమ్స్‌లతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ప్రైవేట్ ఆల్బమ్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ మంచి వ్యూస్ రాబడుతున్నాయి. ఖాళీ సమయాల్లో విహారయాత్రలకు వెళ్లే దీప్తి .. ఇటీవల తన ఫ్రెండ్స్ మెహబూబ్, దెత్తడి హారికలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తన ఈవెంట్లు, షార్ట్ ఫిలింస్, షోల వివరాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు.
తరచుగా ఇన్‌స్టా, ట్విట్టర్‌లలో లైవ్‌లు నిర్వహించి అభిమానులతో టచ్‌లో ఉంటారు. గతేడాది కొత్తింట్లో గృహ ప్రవేశం చేసి తల్లిదండ్రులను సంతోషపెట్టింది. సముద్ర తీర ప్రాంతాల్లో గడపటాన్ని ఇష్టపడే దీప్తి బీచ్‌లలో యోగాసనాలు, డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని ఓ బీచ్‌లో దీప్తి విహరించారు. తాజాగా డార్క్ చాక్లెట్ కలర్ శారీలో వెల్లకిలా పడుకుని, వీపుపై వేసుకున్న టాటూని చూపెడుతూ ఆమె చేసిన ఫోటో షూట్ సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీప్తి అందాలను పొగుడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం దీప్తి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











