బిగ్‌బాస్ బ్యూటీ రెండోసారి పెళ్లి.. ఫారిన్ బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం తర్వాత గోవాలో!
సినీ రంగంలోను, టెలివిజన్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల వార్తలు జోరందుకొన్నాయి. చాలాకాలంగా అఫైర్, డేటింగ్, సహజీవనం చేస్తున్న నటీనటులు ఓ ఇంటివారయ్యేందుకు చొరవ తీసుకొంటున్నారు. అలాగే బిగ్‌బాస్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకొన్న అందాల భామ త్వరలోనే తాను సుదీర్ఘంగా కాలంగా సహజీవనం చేస్తున్న ప్రియుడిని పెళ్లాడబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యూటీ పెళ్లి వివరాల్లోకి వెళితే..
బుల్లితెరపైన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొన్న నటి శ్రీజిత చాలా కాలంగా జర్మనీకి చెందిన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ బ్లోమ్ పాపేతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వారిద్దరి కలిసి సహజీవనం కూడా చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించడానికి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

అయితే తమ ప్రేమ వ్యవహారాన్ని ఇరు కుటుంబాల దృష్టికి తీసుకు రావడంతో వారి ప్రేమకు అంగీకారం తెలిపారు. దాంతో వారి పెళ్లికి మార్గం సుగమమైంది. కానీ కోవిడ్ కారణంగా అందర్నీ ఆహ్వానించడం కుదరకపోవడంతో వారిద్దరూ కొద్ది నెలల క్రితం తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో క్రిస్టియన్ ట్రెడిషన్స్‌లో పెళ్లి చేసుకొన్నారు. దాంతో వారి వైవాహిక జీవితం మొదలైంది.
అయితే వీరిద్దరి జీవిత ప్రయాణంలో అసలు ట్విస్టు ఏమిటంటే? మరోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. బెంగాల్‌కు చెందిన ఈ భామ తమ బెంగాళీ సంప్రదాయ పద్దతుల్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. వారి కుటుంబ సభ్యుల కోరికను కాదనలేక ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు ఆమె వివరించారు.

ఇదిలా ఉండగా, గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలోను బెంగాళీ సంప్రదాయాలను అనుసరించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు తన సన్నిహితులకు ఆహ్వన లేఖలు పంపారు. శ్రీతిజ, మైఖేల్ మెహందీ, సంగీత్ వేడుకలు నవంబర్ 9వ తేదీన, అలాగే పెళ్లి వేడుక నవంబర్ 10వ తేదీన నిర్వహిస్తున్నట్టు వెడ్డింగ్ కార్డులో వెల్లడించారు.
శ్రీజిత కెరీర్ విషయానికి వస్తే.. 2007 సంవత్సరంలో కసౌటీ జిందగీకే ద్వారా హిందీ టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. హిందీ వినోదవ రంగంలో సుపరిచితురాలు. ఆమె ఉత్తరాన్, తుమ హీ హో బంధు సాఖా తుమీ, లేడీస్ స్పెషల్, లాల్ ఇష్క్, యే జాదు జిన్ కా తదితర సీరియల్స్ నటించారు. కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన తషన్, అలాగే మాన్‌సూన్ షూట్ అవుట్, లవ్ కా ది ఎండ్, రెస్క్యూ సినిమా రంగంలో ప్రవేశించింది.


Click it and Unblock the Notifications











