Hari Teja : చీరకట్టులో హరితేజ అందాల విందు .. తెల్లారే లోగా పంపిస్తానంటూ షాకింగ్ పోస్ట్
సోషల్ మీడియా రాకతో కొందరు ముద్దుగుమ్మలు రాత్రికి రాత్రి సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఆల్రెడీ లైమ్ లైట్‌లో ఉన్న వారు అభిమానులు, ఇండస్ట్రీతో టచ్‌లో ఉంటున్నారు. మరికొందరు భామలైతే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి వాటి ద్వారా అవకాశాలు అందుకున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు.
ఇదిలాఉండగా.. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 8కి ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ మెగా రియాలిటీ షో విజేతగా కర్ణాటకకు చెందిన బుల్లితెర నటుడు నిఖిల్ మలియాక్కల్ నిలిచిన సంగతి తెలిసిందే. గత ఆదివారం అక్కినేని నాగార్జున, రామ్ చరణ్‌ల చేతుల మీదుగా నిఖిల్ టైటిల్ ట్రోఫీతో పాటు రూ.55 లక్షల ప్రైజ్ మనీ, మారుతి డిజైర్ కారును అందుకున్నాడు.

ఇప్పటి వరకు బిగ్‌బాస్ ద్వారా జనాల్లో ఉండి, వార్తల్లో బాగా ట్రెండ్ అయిన లేడీ కంటెస్టెంట్స్‌లు ఈ ఫేమ్‌ని ఇలాగే కంటిన్యూ చేసేందుకు అపసోపాలు పడుతుంటారు. దీనిలో భాగంగా హాట్ హాట్ ఫోటో షూట్‌లతో అందాలను ఆరబోస్తుంటారు. ఇనయా సుల్తానా, ప్రియాంక సింగ్, అరియానా, విష్ణుప్రియా, అషురెడ్డి , హమీదా వంటి వారు ఇలాగే బాగా ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. తాజాగా హరితేజ కూడా ఈ లిస్ట్‌లో చేరారు.
కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యురాలైన హరితేజ తొలుత బుల్లితెరపై అడుగుపెట్టారు. మనసు మమత, ముత్తమంత పసుపు, రక్త సంబంధం, అభిషేకం, శివరంజనీ, కన్యాదానం వంటి సీరియల్స్‌తో పాటు అభిరుచి, పండగ చేస్కో, సూపర్ సింగర్ వంటి షోలను అద్భుతంగా హోస్ట్ చేసింది. వీటితో పాటు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా మారారు హరితేజ. అలా తెలుగు నాట మంచి ఫేమ్‌ను సొంతం చేసుకున్న ఆమెకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు.
అందులో హరికథ పేరిట హరితేజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆటతీరుతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా అందించింది తెలుగు లొగిళ్లకు బాగా దగ్గరైంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న హరితేజకు భూమిక దీపక్ రావ్ అనే కుమార్తె కూడా ఉంది. ఖాళీ సమయంలో భర్త, కుమార్తెతో గడపటానికి ఆమె ప్రాధాన్యతను ఇస్తారు. ఇక బిగ్‌బాస్ తెలుగు 8 మధ్యలో 8 మంది కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపారు నిర్వాహకులు . వీరిలో హరితేజ కూడా ఒకరు.
అయితే ఈసారి ఎందుకో హరితేజ తన ముద్ర వేయలేకపోయింది. సీజన్ 1లో ఆటల్లో , ఎంటర్‌టైన్‌మెంట్‌లో దూసుకెళ్లిన హరితేజ.. ఈసారి మాత్రం డల్ అయ్యింది. ఐదు వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగిన హరితేజ.. వారానికి రూ.3.5 లక్షల చొప్పున ఐదు వారాలకు గాను దాదాపు 18 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. టెలివిజన్ రంగంతో పాటు సినిమాలలోనూ నటించింది హరితేజ.
యూటర్న్, అత్తారింటికి దారేది, అఆ, అరవింద సమేత, దమ్ము, ప్రతిరోజు పండగే, హిట్‌లలో కనిపించిన ఈమె రీసెంట్‌గా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవరలోనూ మెరిసింది. తాజాగా కాంచీపురం సిల్క్ శారీలో ఫోటో షూట్ చేసి అందాలను ఆరబోసింది. అంతేకాదు.. ఈ పోస్ట్‌కు '' నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా '' అంటూ కామెంట్ పెట్టింది. మరి ఇంకేందుకు ఆలస్యం హరితేజ అందాలను మీరూ చూసేయ్యండి.


Click it and Unblock the Notifications











