బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు బ్రెస్ట్ క్యాన్సర్.. ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్

టెలివిజన్, సినీ రంగాల్లో రాణిస్తున్న నటి హీనా ఖాన్‌ ఆరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు, రూమర్లకు ఆమె తెరదించింది. తన హెల్త్ గురించి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ.. తాను క్యాన్సర్ బారిన పడినట్టు తెలియజేసి తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. హీనా ఖాన్‌కు క్యాన్సర్ అని తెలియగానే సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆమెకు మనోధైర్యాన్ని ఇస్తూ అండగా నిలిచారు.హీనా ఖాన్ గురించి, ఆమె షేర్ చేసిన వివరాల్లోకి వెళితే..

హీనా ఖాన్ కాశ్మీర్‌కు చెందిన ఇస్లాం మతంలో జన్మిచారు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత గ్లామర్ ఫీల్డుపై ఉన్న మక్కువతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇండియన్ ఐడల్ ద్వారా 2008లో వినోద పరిశ్రమకు పరిచయం అయ్యారు.

Bigg Boss Contestant Hina Khan Diagnosed Breast Cancer Here Nagin fame acter Instagram post

ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి యే రిస్తా క్యా కహ్లాతాహై, ఫియర్ ఫ్యాక్టర్, బిగ్‌బాస్ 11 హిందీ, కసౌటీ జిందగీ క్యా, నాగిన్ 5, బిగ్‌బాస్ 14 లాంటి షోలతో మరింత పాపులారిటీ సాధించారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి స్మార్ట్ ఫోన్ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. కానీ వెండితెరపైన కంటే బుల్లితెరపైనే ఎక్కువ పాపులారిటీ సాధించారు.

నాగిన్‌గా, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా పాపులారిటీ సాధించిన హీనా ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో క్యాన్సర్ వ్యాధికి గురయ్యాను. ఆ వ్యాధి ప్రస్తుతం మూడో స్టేజ్‌లో ఉందని వెల్లడించడం సినీ వర్గాలకు నిజంగా దిగ్బ్రాంతిని కలిగించింది. ఆమె తన అభిమానులు, శ్రేయాభిలాషులకు తన పరిస్థితిని విన్నవించుకొంటూ ఎమోషనల్ అయింది.

Bigg Boss Contestant Hina Khan Diagnosed Breast Cancer Here Nagin fame acter Instagram post

నా ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న రూమర్ల గురించి వివరణ ఇవ్వాలని అనుకొంటున్నాను. నేనంటే ఇష్టపడే వారికి, నన్ను ప్రేమించే వారికి తెలియజేసేది ఏమిటంటే.. నేను క్యాన్సర్ వ్యాధికి గురయ్యానని వైద్యులు వెల్లడించారు. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఆ వార్త విని నేను కుంగిపోలేదు. నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను అని తెలిపారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురయ్యానని తెలిసిన తర్వాత మరింత మనో నిబ్బరాన్ని కూడగట్టుకొన్నాను. ఆ వ్యాధికి చికిత్స ఇప్పటికే మొదలైంది. నేను మరింత స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఏం చేయడానికైనా సిద్దం. నా ఆరోగ్యం కోసం, నేను కోలుకోవాలని కోరుకొనే వారికి ధన్యవాదాలు అని హీనా ఖాన్ తెలిపారు.

More from Filmibeat

Read more about: hina khan bigg boss cancer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X