కరాటే కళ్యాణి పొలిటికల్ ఎంట్రీ.. అలా జరిగితే పవన్ అభిమానులు మద్దతివ్వాల్సిందే..
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకి మరింత ఆసక్తిగా మారుతోంది. రేటింగ్ తగ్గకుండా నిర్వాహకులు వేస్తున్న ప్లాన్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి షోలోకి చిన్న తరహా సెలబ్రెటీలు వచ్చినప్పటికీ అద్భుతమైన టాస్క్ లతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక షో నుంచి రెండు వారాలకే ఎలిమినెట్ అయిన కరాటే కళ్యాణిపై ఇప్పుడు అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. షోలోకి ఆమె 12వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Recommended Video

ఎంత కష్టపడిన ఫలితం దక్కలేదు..
కరాటే కళ్యాణి బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు గట్టిగానే పోరాటం చేసింది గాని పెద్దగా వర్కౌట్ కాలేదు. బయటకు వచ్చిన తరువాత ఆమె బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాయి. ప్లాన్ ప్రకారమే హౌజ్ నుంచి తప్పించారని తనపై కుట్ర జరిగిందని కూడా కళ్యాణి ఆరోపించారు. కళ్యాణి గ్యాప్ లేకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ జనాల దృష్టిని ఎక్కువగా ఆకరిస్తోంది.

రాజకీయాల్లోకి కరాటే కళ్యాణి
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కరాటే కల్యాణి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇటీవల ఆమె స్పందించిన తీరు అందరిని షాక్ కి గురి చేసింది. ఇంకా భారత జనతా పార్టీ కండువ కప్పుకోకముందే తనదైన శైలిలో అధికార పార్టీపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది

సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ..
కరాటే కళ్యాణి రాజకీయాల్లోకి చేరనున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఫైనల్ గా కుండబద్దలు కొట్టిన ఆమె భారత జనతా పార్టీ నాయకురాలిగా కొనసాగేందుకు డిసైడ్ అయ్యారు. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ ఇటీవల ఆమె తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై స్పందించింది. హిందువుల మనోభావాలను సీఎం జగన్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆయన పాలనలో ఆలయాలపై దాడులు ఎక్కువవుతున్నాయని అన్నారు.

జనసేన మద్దతు ఇవ్వాల్సిందే..
వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పార్టీ టికెట్ లభించే అవకాశం ఉందని మరికొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ద్వారా వచ్చిన చిన్నపాటి క్రేజ్ ని మరింతగా పెంచుకోవాలని కళ్యాణి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం భారత జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చేతులు కలిపింది కాబట్టి జనసైనికులు ఆమెకు కూడా మద్దతు ఇవ్వాల్సిందే.


Click it and Unblock the Notifications











