ఎలిమినేట్ అయ్యాక రెచ్చిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ .. సోకులతో కోసేస్తోన్న కిర్రాక్ సీత

దాదాపు 105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు 8 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచాడు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండొచ్చిన వారికి సహజంగానే బయట నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. దీనిలో భాగంగా బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్‌ కూడా బాగా పాపులర్ అయ్యారు. వీరిలో ఒకరు కిర్రాక్ సీత.

రాయలసీమలోని కర్నూలు జిల్లా నంద్యాలలో పుట్టారు కిర్రాక్ సీత. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వీరి కుటుంబం హైదరాబాద్ ఉప్పల్‌లో స్థిరపడింది. చదువులో టాపర్ అయిన సీతకి కూచిపూడి, భరతనాట్యంలోనూ ప్రావీణ్యం ఉంది. తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో సీత చిన్నప్పటి నుంచి తన పాకెట్ మనీని తనే సంపాదించుకున్నారు. తొలుత యూట్యూబర్‌గా సంచలనం సృష్టించారు.

bigg boss contestant kirrak seetha PhotoShoot With trendy wear Her latest photos here

ఈ క్రమంలోనే సీతకు సినిమాల్లోనూ అవకాశాలు దక్కాయి. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్‌ను చెడగొట్టి ఆమెను చెడు వ్యసనాలకు బానిసను చేసే మోడ్రన్ అమ్మాయి రోల్‌లో అద్భుతంగా నటించింది కిర్రాక్ సీత. యూట్యూబ్ మహత్యమో ఏమో కానీ సీత ఏం మాట్లాడినా బోల్డ్‌గా ఉంటుంది. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆమె స్టైల్.

బేబీ సినిమాలో పాత్ర తర్వాత ఓ ఈవెంట్‌కి వెళ్లి వస్తున్న తనను కొందరు అబ్బాయిలు ఫాలో అయ్యారని సీత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ చూసిన జనం తనను రేప్ చేస్తామంటూ బెదిరించారని.. దీంతో తన ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారని కానీ తాను అలా చేయలేదని సీత తెలిపారు. ఇక మరో ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొందరు మనుషులు వచ్చి ప్రొడ్యూసర్, దర్శకుడు మిమ్మల్ని ఫాంహౌస్‌లో కలవాలని అనుకుంటున్నారని చెప్పేవారని సీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు మూడు సార్లు తప్పించుకోవాలని చూసినా కొందరు బలవంతం చేశారని.. అయితే తాను అక్కడికి రాలేనని , ఏదైనా మూవీ ఆఫీస్ ఉంటే అక్కడికి వస్తానని చెప్పగా.. వారు మళ్లీ కాల్ చేయలేదని సీత పేర్కొంది.

అందరు అమ్మాయిల మాదిరిగానే సీత కూడా ఓ అబ్బాయిని ఐదేళ్ల పాటు ఎంతో గాఢంగా ప్రేమించగా.. ఆ వ్యక్తి దూరం కావడంతో మానసికంగా కృంగిపోయినట్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు బయటపెట్టింది. నెమ్మదిగా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న సీత.. శ్రీకృష్ణుడి భక్తురాలు. ఆయన సేవలో తరిస్తానని తరచుగా చెబుతుంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే కిర్రాక్ సీత ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో థైస్ చూపిస్తూ వింటర్‌లో కుర్రాళ్లకు సెగలు రేపుతోంది కిర్రాక్ సీత. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X