నా జీవితం అలా.. గుండె బరువెక్కిపోతోంది.. నటి ప్రియ ఎమోషనల్!

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్‌డమ్ అందుకున్నారు నటి ప్రియ. తన అందం, అభినయంతో హీరోయిన్ రేంజ్‌లో పాపులర్ అయ్యారు. సీరియల్స్‌తో పాటు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈవిడ పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. స్టార్ హీరోలు, హీరోయిన్‌ల రేంజ్‌లో ప్రియకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నటి ప్రియ ఖాతాకు ఏకంగా 1.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

సీరియల్స్ నుంచి సినీ రంగం వైపు
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన శైలజా ప్రియ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. తొలుత బుల్లితెరపై అడుగుపెట్టిన ఆమె.. ప్రియసఖి ధారావాహికలో నటించారు. ఈ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియకు ఆ తర్వాత సంఘర్షణ, లేడీ డిటెక్టివ్, మిసెస్ శారద, జ్వాల వంటి ధారావాహికలలో అవకాశాలు వచ్చాయి. అనంతరం సినిమా రంగం నుంచి ప్రియకు కబురు వచ్చింది. తొలుత మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో ఓ చిన్నపాత్రలో నటించారు శైలజ ప్రియ.

Bigg Boss Contestant Mamilla Shailaja Priya shares Emotional Post

బిగ్‌బాస్‌తో పాపులారిటీ
అనంతరం దొంగాట, గోకులంలో సీత, మాస్టర్, మావిడాకులు,రాజకుమారుడు, అన్నయ్య, జయం మనదేరా, సూర్యుడు, ఢమరుకం, చిరునవ్వుతో, కత్తి కాంతారావు, పిల్లా నువ్వు లేని జీవితం, సన్నాఫ్ సత్యమూర్తి, పండగ చేస్కో, మిర్చి, ఉప్పెన, శ్రీకరం తదితర చిత్రాల్లో ప్రియ నటించారు. 2002లో కిషోర్ అనే వ్యక్తిని ప్రియ పెళ్లాడారు. ఈ దంపతులకు ఓ కుమారుడు నిశ్చయ్ సంతానం. అనూహ్యంగా బిగ్‌బాస్ తెలుగు 5లో అవకాశం దక్కించుకుని ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు.

ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు
40 ప్లస్‌లో ఉన్నప్పటికీ టాస్క్‌లు, గేమ్స్‌లో కుర్రాళ్లతో పోటీపడి ఆడారు ప్రియ. అయితే కోపం, ఆవేశం కారణంగా ఆమెపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ వచ్చింది. వీజే సన్నీతో గొడవ పడినప్పుడు ప్రియ మాట్లాడిన మాటలు జనంలోకి బలంగా వెళ్లాయి. ఈ కారణంతోనే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారనుకున్న ప్రియ ఎలిమినేట్ అయ్యారని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

సీరియల్స్‌తో బిజీ
బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులరైన ప్రియకు ఆ తర్వాత సీరియల్స్, సినిమాలలో అవకాశాలు క్యూకట్టాయి. చక్రవ్యూహం: ది ట్రాప్, సామజవరగమణ, శ్రీ శ్రీ శ్రీ రాజా వారు తదితర సినిమాలతో పాటు నెంబర్ వన్ కోడలు, నందిని vs నందిని, కృష్ణ ముకుంద మురారి, ఒంటరి గులాబి వంటి సీరియల్స్‌లో నటించారు. ఈమె పాపులారిటీ దృష్ట్యా భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా దర్శక నిర్మాతలు వెనుకాడటం లేదట.

గుండె బరువెక్కింది
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, సీరియల్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ప్రియ ఇన్‌స్టాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ ఫ్యాంట్, అదే రంగు టాప్‌లో నడుము అందాలు చూపిస్తూ ప్రియ హీటెక్కిస్తున్నారు. ఈ పోస్ట్‌కు తన జీవితం నిండిపోయింది.. నా గుండె కృతజ్ఞతతో బరువెక్కిపోయింది. ఎంత ఎక్కువ ఇస్తే.. అంతే వెనక్కి వస్తుంది అంటూ ప్రియ రాసుకొచ్చారు. దీనికి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X