బిగ్ బాస్2: శ్యామలపై నందిని సంచలన వ్యాఖ్యలు, ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా.. కౌశల్ హౌస్‌లోకి వచ్చే ముందే!
బిగ్ బాస్ షోలో ఇంటి సభ్యుల పెర్ఫామెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. రెండు నెలలు పూర్తి కావడంతో ఇంటి సభ్యులంతా ఎవరికి వారు టైటిల్ బరిలో నిలవాలని భావిస్తున్నారు. అందరిలో మునుపటికంటే హుషారు పెరిగింది. ఆడియన్స్ కి వినోదాన్ని అందించడం కోసం కొత్త కొత్త టాస్క్ లతో అలరిస్తున్నారు. గతవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నందిని ఓ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది.

నాతో పెట్టుకున్నవారంతా
బిగ్ బాస్ 2 లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న కౌశల్ పై గురించి నందిని పలు విషయాలు వెల్లడించింది. కౌశల్ పై తమకు మొదటి నుంచి అనుమానంగానే ఉండేదని తెలిపింది. నాతో పెటుకున్నవారంతా బయటకు వెళ్లిపోతున్నారని కౌశల్ ఓ సందర్భంలో అన్నారు.

అదే జరిగింది
తేజు, కిరీటి, భాను విషయంలో అదే జరిగిందని నందిని తెలిపింది. వారు ముగ్గురూ కౌశల్ తో విభేదించిన తరువాత ఎలిమినేట్ అయ్యారని గుర్తు చేసింది. అప్పటినుంచే ఇంటి సభ్యులలో కౌశల్ పై అనుమానం పెరిగింది. కౌశల్ హౌస్ లోకి వచ్చే ముందే బయట ఏమైనా సెట్ చేసుకుని వచ్చారా అని చర్చించుకున్నాం అని తెలిపింది.

ఒక్కడిగానే
కౌశల్ అందరితో బాగానే ఉంటాడు. కానీ టాస్క్ లు ఆడే సమయంలో టీంతో కలసి ఆడడు. ఒక్కడిగానే ఆడుతాడు. అందరితో కలసి ఆడు కౌశల్ అని చాలా సార్లు చెప్పాం. కానీ అతడు వినలేదు అని నందిని తెలిపింది.

నా మీదే ఎందుకు
బయటకు వచ్చాక నాపై జరిగిన ట్రోలింగ్ గమనించా. కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేసినట్లు తెలిసింది. కౌశల్ తో పెట్టుకుంటే నీ గతి ఇంతే అంటూ కామెంట్స్ కనిపించాయి. నా మీద ఎందుకు పడిచస్తారు. నేను కౌశల్ బాగానే ఉన్నాం అని నందిని తెలిపింది.

విడిపోవడానికి కారణం
బిగ్ బాస్ హౌస్ లో శ్యామల ఎందుకు అని నందిని ప్రశ్నించింది. దీప్తి, శ్యామల ఒకేలా ఆడుతున్నారు. దీప్తి చూస్తే శ్యామలని చూసినట్లే ఉంది. ఇంక ఎలిమినేట్ అయిన శ్యామలని మళ్ళీ ఎందుకు తీసుకుని వచ్చారు. ఆమె వలనే హౌస్ రెండు గ్రూపులుగా విడిపోయిందని నందిని సంచలన వ్యాఖ్యలు చేసింది.


Click it and Unblock the Notifications











