‘ఆ హీరోతో అలాంటి సీన్స్ చేశా.. బాయ్‌ఫ్రెండ్‌కి తెలిసి నా ముఖం మీదే’
స్టార్ మాలో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు ప్రేరణ కంబం. ఈ పాపులారిటీతో గతేడాది ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా స్థానం సంపాదించారు. తన మైండ్‌గేమ్‌తో గత సీజన్‌లో టాప్ 5లో చోటు దక్కించుకుని శెభాష్ అనిపించుకున్నారు. గౌతమ్, నిఖిల్‌లకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకుల తీర్పు మేరకు గ్రాండ్ ఫినాలేలో ఎలిమినేట్ అయ్యింది ప్రేరణ. సీరియల్స్, రియాలిటీ షోలలో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ బాగా బిజీగా ఉంది. ప్రస్తుతం జబర్దస్త్ ఫేమ్ వర్ష నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన తన కెరీర్, లవ్‌స్టోరీ సహా ఇతర విషయాలను బయటపెట్టింది.
పుట్టింది హైదరాబాద్‌లోనే
ప్రేరణ కంబం హైదరాబాద్‌లోనే పుట్టింది. అలాగని ఆమె తెలుగు అమ్మాయి కాదు.. పక్కా తమిళయన్. ప్రేరణ తండ్రి పురుషోత్తమ్.. టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఉద్యోగరీత్యా ఆయన అమెరికా వెళ్లడంతో ప్రేరణ కుటుంబం కొన్నాళ్లు అమెరికాలోనే ఉంది. ఆ తర్వాత వీరి కుటుంబం తిరిగి ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడింది. నగరంలోనే చదువుకున్న ప్రేరణ.. చదువుల్లోనూ, క్రీడల్లోనూ టాపర్. లాంగ్ జంప్, హైజంప్‌తో పాటు 400, 800 మీటర్ల పరుగు పందెంలోనూ పాల్గొన్నారు. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అనంతరం స్నేహితుల సూచన మేరకు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. కొన్ని చిత్రాల్లో నటించి బుల్లితెరపై అడుగుపెట్టింది. దాదాపు 8 సినిమాలలో హీరోయిన్ నటించారు ప్రేరణ.

శ్రీపాదతో ప్రేమ, పెళ్లి
తెలుగు బిగ్‌బాస్ కంటే ముందు కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్ చేసిన కన్నడ బిగ్‌బాస్ మినీ సీజన్‌లో పాల్గొన్నారు. తెలుగులో కృష్ణ ముకుంద మురారితో పాటు కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గాల్స్ షోలో ప్రేరణ సందడి చేశారు. శ్రీపాద దేశ్‌పాండేతో ప్రేమలో పడ్డ ప్రేరణ కంబం.. పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తన భర్తను చూసుకుని చిన్నపిల్లలా ఏడ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు ప్రేరణ.
మా ఆయన నన్ను భరించలేడు
జబర్దస్త్ వర్ష ఓ ఛానెల్‌లో నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షోలో గెస్ట్‌గా హాజరైన ప్రేరణ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తనకు స్నానం చేయడం అంటే బద్ధకమని, రెండ్రోజుల పాటు స్నానం చేయకుండా ఉంటానని చెప్పడంతో వర్ష షాక్ అయ్యింది. శ్రీపాద్‌తో ప్రేమ, పెళ్లి కావడంతో నెల క్రితమే కొత్తగా డేట్ చేయడం ప్రారంభించినట్లుగా అనిపిస్తుందన్నారు ప్రేరణ. నిన్ను ఎందుకు చేసుకున్నాను రా బాబు అని మా ఆయన ప్రతిరోజూ ఫీల్ అవుతూనే ఉంటాడని ప్రేరణ తెలిపింది.
రష్మిక మందన్న నా ఫ్రెండ్
నా జీవితంలో చాలా రోలర్ కోస్టర్స్ ఉన్నాయి.. సూపర్‌గా వెళ్లిన మా రిలేషన్‌షిప్స్‌లో బ్రేకప్స్ కూడా అయ్యాయని ఆమె వెల్లడించారు. తొలి సినిమాలో హీరోకి ముద్దు పెట్టాల్సిన సీన్ చేయాల్సి వచ్చిందని.. దాంతో ఈ విషయం తెలిసి నేను ఇదంతా తట్టుకోలేనని నా బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేశాడని ప్రేరణ వెల్లడించింది. కార్నర్ సీటులో కూర్చొని కపుల్స్ చేయాలనుకునే వాటిని నేను ఏ సీటులోనైనా చేస్తానని బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. రష్మిక మందన్న కన్నడలో, నేను తెలుగులో స్టార్స్ అవుతామని మా ఫ్యామిలీస్ అనుకున్నాయని ప్రేరణ చెప్పింది. రష్మిక ఇప్పుడు నన్ను గుర్తుపట్టే స్థాయిలో లేదని ఆమె వెల్లడించింది.


Click it and Unblock the Notifications











