Rathika Rose : జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ కష్టాలు.. తడి తడి అందాలతో రతిక రోజ్

బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో పేరు తెచ్చుకున్నవాళ్లు మనదేశంలో ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన ఫేమ్‌తో సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లో అవకాశాలు తెచ్చుకుని నటీనటులుగా రాణిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో రతికా రోజ్ కూడా ఒకరు. బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలు, వివాదాస్పద వైఖరితో హౌస్‌లో హల్ చల్ చేసింది.

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించారు రతికా రోజ్. ఆమె తండ్రి పేరు రాములు యాదవ్, తల్లి అనితా రాణి. తండ్రి సాధారణ రైతు. చదువులో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవారు రతిక.. టెన్త్ , ఇంటర్‌ను గంగోత్రీ విద్యాలయాలో, జవహర్ నవోదోయ విద్యాలయలో పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ అందుకున్నారు రతిక.

bigg boss contestant Rathika Rose gym workout photos goes viral

ఈ క్రమంలో నటనపై ఆసక్తితో తొలుత బుల్లితెరపై అడుగుపెట్టారు. మోడల్‌గానూ పనిచేసిన రతికా రోజ్.. 2020లో జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్రంలో ఛాన్స్ అందుకుని వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా రతికా రోజ్ పాత్రకు, అందానికి మాత్రం మంచి స్పందన లభించింది. తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. నటిగా, మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న రతికకు బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది.

తన అందంతో హౌస్‌కి గ్లామర్ అద్దిన రతిక .. రైతు బిడ్డ, బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో చాలా క్లోజ్‌గా ఉండేది. అలాంటి ప్రశాంత్‌ను టార్గెట్ చేయడంతో ఆమెపై నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది. అంతే ఆమెను ఇంటికి పంపే వరకు నిద్రపోలేదు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెను సీజన్ మధ్యలో మళ్లీ తీసుకొచ్చారు. సెకండ్ ఛాన్స్‌ను కూడా ఆమె సరిగా వినియోగించుకోలేకపోయింది. బిగ్‌బాస్ ముగిసిన తర్వాత రతికా రోజ్‌కు ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. భగవంత్ కేసరి, నారప్ప, అశోక వనంలో అర్జున కళ్యాణం తదితర చిత్రాల్లో నటించింది. బిగ్‌బాస్ విన్నర్, స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో గతంలో రతిక ప్రేమాయణం నడిపి షాకిచ్చింది.

రతికా టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇక ఆమె సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్‌‌ వేసి జిమ్‌లో వర్కవుట్స్ చేసిన రతికా.. అక్కడే పడుకుని తన అందాలతో కవ్వింపులకు దిగింది. మరి ఇంకేందుకు రతిక అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: rathika rose
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X