Bigg Boss Telugu : మనుషులు ఇంత కఠినమా .. ఎంత ప్రేమించినా , బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

సోషల్ మీడియా రాకతో స్టార్లుగా వెలుగొందుతున్న వారిలో రతికా రోజ్ ఒకరు. తెలుగు బుల్లితెరపై తన అందాలతో హల్‌చల్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఈ ఫేమ్‌తో పలు సినిమాల్లోనూ అవకాశాలు సాధించిన ఈ భామ.. కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రతికా రోజ్.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించారు రతికా రోజ్. ఆమె తండ్రి పేరు రాములు యాదవ్, తల్లి అనితా రాణి. తండ్రి సాధారణ రైతు. చదువులో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవారు రతిక.. టెన్త్ , ఇంటర్‌ను గంగోత్రీ విద్యాలయలో, జవహర్ నవోదోయ విద్యాలయలో పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివారు రతిక. విద్యాభ్యాసం అనంతరం నటనపై ఆసక్తితో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు.

bigg boss contestant Rathika Rose PhotoShoot with Black Dress Her latest photos here

మోడల్‌గానూ పనిచేసిన రతికా రోజ్.. 2020లో షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా రతికా రోజ్ పాత్రకు మాత్రం మంచి స్పందన లభించింది. తర్వాత బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. నటిగా, మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రతికకు బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది.

తన అందంతో హౌస్‌కి గ్లామర్ అద్దిన రతికా రోజ్.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చాలా క్లోజ్‌గా ఉండేది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే కామెంట్స్ వినిపించాయి. అయితే సెకండ్ వీక్‌లో ప్రశాంత్‌ని నామినేట్ చేసే సమయంలో నోరు జారడంతో ఆమెపై విపరీతంగా నెగిటివిటీ వచ్చింది. ఈ దెబ్బకు రతికను ఆడియన్స్ ఇంటికి పంపారు. అయితే అనుకోకుండా మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సీజన్ మధ్యలో అడుగుపెట్టారు రతికా రోజ్. బిగ్‌బాస్ షోతో మంచి ఫేమ్ సంపాదించిన రతికా రోజ్‌కు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలో ఓ పాత్ర పోషించింది. నారప్ప, అశోక వనంలో అర్జున కళ్యాణంలోనూ ఆఫర్లు అందుకుంది.

రతికా టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండేది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రతికకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ప్రపంచం చాలా కఠినమైనదని, దానిని మరింత కఠినంగా మార్చొద్దని రాసుకొచ్చింది. అలాగే ప్రేమను, సంతోషాన్ని పంచుకుందాం అన్నట్లుగా హ్యాష్‌టాగ్ ఇచ్చింది. వీటితో పాటు బ్లాక్ డ్రెస్‌లో పెదాలు కొరుకుతున్న ఫోటోలు షేర్ చేసి కుర్రకారుకి గిలిగింతలు పెడుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: bigg boss telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X