Rathika Rose : టూ పీస్ డ్రస్సులో చిలిపి చేష్టలు .. అందంతో మెలితిప్పేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ

నలుగురితో టచ్‌లో ఉండటానికి , తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఉద్దేశించిన సోషల్ మీడియా.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా రాకతో కొత్తగా ఇన్‌ఫ్లూయెన్సర్లు అన్న పదం బాగా వినిపిస్తోంది. టాలెంట్ ఉండి దానిని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేని ఎంతోమందికి సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. డ్యాన్స్, సింగింగ్, యాక్టింగ్ సహా మరెన్నో కళలను ప్రదర్శించి మంచి అవకాశాలను పొందుతున్న వారెందరో.

అలా తెలుగునాట సోషల్ మీడియాలో స్టార్లుగా వెలుగొందుతున్న వారిలో రతికా రోజ్ ఒకరు. తెలుగు బుల్లితెరపై తన అందాలతో హల్‌చల్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించారు రతికా రోజ్. ఆమె తండ్రి పేరు రాములు యాదవ్, తల్లి అనితా రాణి. తండ్రి సాధారణ రైతు. చదువులో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవారు రతిక.. టెన్త్ , ఇంటర్‌ను గంగోత్రీ విద్యాలయాలో, జవహర్ నవోదోయ విద్యాలయలో పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివారు రతిక.

bigg boss contestant Rathika Rose PhotoShoot with two piece dress Her latest photos here

చదువు పూర్తి చేసిన అనంతరం నటనపై ఆసక్తితో తొలుత టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు. మోడల్‌గానూ పనిచేసిన రతికా రోజ్.. 2020లో జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా రతికా రోజ్ పాత్రకు, అందానికి మాత్రం మంచి స్పందన లభించింది. తర్వాత బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి షాకిచ్చింది. నటిగా, మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రతికకు బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది.

తన అందంతో హౌస్‌కి గ్లామర్ అద్దిన రతికా రోజ్.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చాలా క్లోజ్‌గా ఉండేది. అయితే ప్రశాంత్‌ని నామినేట్ చేసే సమయంలో నోరు జారడంతో ఆమెపై బిగ్‌బాస్ లవర్స్‌కి విపరీతంగా కోపం రావడంతో ఇంటికి పంపేశారు. అయితే ఊహించని విధంగా మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సీజన్ మధ్యలో అడుగుపెట్టారు రతిక. ఈ షో తర్వాత రతికా రోజ్‌కు సినిమాల్లో అవకాశాలు క్యూకట్టాయి. భగవంత్ కేసరి, నారప్ప, అశోక వనంలో అర్జున కళ్యాణంలోనూ నటించింది.

రతికా టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్కూల్ యూనిఫాం మాదిరిగా ఉన్న వైట్ కలర్ టాప్, బ్లాక్ కలర్ స్కర్ట్‌‌తో రెండు జడలు వేసుకుని కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు రతిక. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: rathika rose
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X