బికినీ బ్రాలో రతికా లేలేత అందాలు .. రెచ్చగొట్టేలా బిగ్‌బాస్ బ్యూటీ గ్లామర్ షో!

టాలీవుడ్ టూ బాలీవుడ్ బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతో మందికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది బిగ్‌బాస్. దీని ద్వారా మాకేం ఒరిగింది లేదని విమర్శలు చేసినా.. బిగ్‌బాస్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ కోవలోకే వస్తారు రతికా రోజ్. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చగొట్టడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు రేపేలా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అచ్చ తెలుగు అమ్మాయి రతికా . తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాకు చెందిన ఈమె వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. రతిక తండ్రి పేరు రాములు యాదవ్, తల్లి అనితా రాణి. బీటెక్ పూర్తి చేసిన అనంతరం బుల్లితెరపై అడుగుపెట్టారు రతిక. ఆపై మోడల్‌గానూ పలు టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు రతిక.

bigg boss contestant Rathika Rose stunning photoshoot goes viral

తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. నటిగా, మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా యువతలో క్రేజ్ తెచ్చుకున్న రతికా రోజ్‌‌కు బిగ్‌బాస్ నుంచి పిలుపొచ్చింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ తన అందంతో ఆకట్టుకున్నప్పటికీ , ఆటపరంగా వ్యతిరేకత మూటకట్టుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌తో చీటికీ మాటికి గొడవ పెట్టుకోవడంతో ఈమెను ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేశారు. కానీ సీజన్ మధ్యలో మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో అడుగుపెట్టిన రతికకు మరోసారి నిరాశే ఎదురైంది. ఎక్కువ రోజులు ఆమె అలరించలేక రెండవసారి ఎలిమినేట్ అయ్యారు.

బిగ్‌బాస్ క్రేజ్‌తో మరింత పాపులర్ అయిన రతికా రోజ్‌కు సినిమాలలో మంచి అవకాశాలు దక్కాయి. భగవంత్ కేసరి, నారప్ప, అశోక వనంలో అర్జున కళ్యాణం తదితర చిత్రాల్లో నటించింది. అలాగే రతికా టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు. అందరు సెలబ్రెటీల మాదిరిగానే రతికా రోజ్‌ కూడా ప్రేమలో పడింది. ఈమె లవర్ ఎవరో కాదు.. స్టార్ సింగర్, ఆస్కార్ అవార్డ్ విజేత రాహుల్ సిప్లిగంజ్. హౌస్‌లో ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ముందే బయట పెట్టడంతో అంతా అవాక్కయ్యారు.

రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసే సమయంలో ఆయనతో ప్రేమలో పడినట్లు చెప్పారు. అయితే పునర్నవితో రాహుల్ ప్రేమాయణం కారణంగా రతికతో బ్రేకప్ అయినట్లుగా సోషల్ మీడియా టాక్. నాటి నుంచి ఒంటరిగానే ఉంటున్న రతిక కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. ఇక ఆమె సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ పెట్టికోట్‌‌లో భారీ అందాలు దాచిన రతికా.. తన అందాలతో కవ్వింపులకు దిగింది. మరి ఇంకేందుకు రతిక అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: bigg boss rathika rose
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X