అర్ధరాత్రి 2 గంటలైనా ప్రభాస్‌కు అది కావాల్సిందే .. బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో అందరివాడిగా , మంచి మనిషిగా మన్ననలు అందుకుంటున్నారు ప్రభాస్. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనను విమర్శించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. పాన్ ఇండియా హీరోగా ప్రజంట్ ప్రభాస్‌కున్నంత మార్కెట్, ఇమేజ్ బాలీవుడ్ స్టార్స్‌కు కూడా లేదు. ప్రభాస్ సినిమా చేస్తే కలెక్షన్ల వర్షమేనని నిర్మాతలు ఫిక్స్ అయిపోతున్నారు. ఎంతపెద్ద స్టార్ హీరో అయినా , ఆయన కూడా సగటు మనిషే. ప్రభాస్ గురించి బయటికి తెలియని విషయం పంచుకున్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషా. ఆ వివరాల్లోకి వెళితే..
బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ కావడమే గాక.. దేశంలోనే నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నారు ప్రభాస్. మంచితనానికి పెట్టింది పేరైన ప్రభాస్.. తన ఇంటికి ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టుకుండా పంపరు. తన మిత్రులు, సన్నిహితులకు బహుమతులు, స్వీట్లు పంపడం ప్రభాస్‌కు అలవాటు. అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ యూనిట్ సభ్యులందరికీ తన ఇంటి నుంచి భోజనాలు తెప్పిస్తుంటాడు ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్ సలార్ 2, కల్కి 2తో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది రాజా సాబ్ మూవీని వేగంగా కంప్లీట్ చేస్తున్నారు ప్రభాస్. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్. ఇది కాకుండా రీసెంట్‌గా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో మరో మూవీ సెట్స్‌పైకి ఎక్కింది. భారత స్వాతంత్య్రోద్యమ పోరాటం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్షేషన్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇకపోతే.. హీరో రాజ్ తరుణ్ - లావణ్య ఎపిసోడ్ మధ్యలో తెరపైకి వచ్చారు ఆర్జే శేఖర్ భాషా. కొన్నేళ్లుగా ఆర్జేగా , రేడియో జాకీగా పనిచేస్తున్నప్పటికీ రాజ్ తరుణ్ ఇష్యూతో ఆయన జనంలో బాగా నోటెడ్ అయ్యారు. ఈ పాపులారిటీతోనే శేఖర్ భాషాకు బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. తన వాక్చాతుర్యం , సమయస్పూర్తితో హౌస్‌లో ఆయన దూసుకెళ్తున్నారు. ఎంత సీరియస్ వాతావరణాన్ని అయినా సరే ఆహ్లాదకరంగా మార్చేస్తున్నారు. ఇదే విషయాన్ని కంటెస్టెంట్స్ నాగార్జున ముందే ఒప్పుకున్నారు. కాగా.. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశించకముందు శేఖర్ భాషా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.
ప్రభాస్ డార్లింగ్ , స్వీట్ హార్ట్ అని.. ఆయన డౌన్ టు ఎర్త్ అని చెప్పారు. అమీర్‌పేట మైత్రీవనం వద్ద అర్ధరాత్రి 2 , 3 గంటలైనా బజ్జీలు, టిఫిన్ దొరుకుతుందని అక్కడికి వచ్చి ప్రభాస్ సైలెంట్‌గా తిని వెళ్తారని భాషా చెప్పారు. ఎంత ఎదిగినా ఆయన ఒదిగే ఉంటారని , ఆ కటౌట్ వేరని ప్రశంసించారు. ప్రభాస్ సినిమాల్లో బాహుబలి సిరీస్, సాహో అంటే ఇష్టమని భాషా చెప్పారు. సాహో జనాలకు అర్ధం కాలేదు కానీ అది నెక్ట్స్ లెవల్ అన్నారు. ప్రస్తుతం ఆర్జే శేఖర్ భాషా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











