Bigg Boss బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై 10 కోట్ల పరువు నష్టం దావా.. పబ్లిసిటీ కోసం ఆ స్టార్ హీరోను..!
బిగ్‌బాస్ రియాలిటీ షో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నదనే విమర్శలకు కంటెస్టెంట్లు బలంగా మారుతున్నారు. వివాదాల లేకుండా ఈ షో సాగడం కష్టంగా కనిపిస్తున్నది. బిగ్‌బాస్‌లోకి వచ్చే వాళ్లు అటెన్షన్ కోసం నోటికి పనిచెప్పి ఇబ్బందుల్లో పడుతున్నారు. పబ్లిసిటీ కోసం ప్రయత్నించిన ఓ కంటెస్టెంట్ కూడా తాజాగా అదే జాబితాలో చేరారు. నోటి దురుసు కారణంగా ఆమె పరువు నష్టం దావాను ఎదుర్కొంటున్నారు. ఇంతకు భారీ పరువునష్టం దావాను ఎదుర్కొంటున్న కంటెస్టెంట్ ఎవరు? ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమిటి? అనే విషయాల్లోకి వెళితే..
సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరించే బిగ్‌బాస్ షోలో ప్రతీ రోజు ఏదో ఒక వివాదం తెరపైకి వస్తున్నది. ఈ షోలో పాల్గొంటున్న క్రిమినల్ లాయర్ సనా రాయిస్ ఖాన్ అత్యంత వివాదాస్పదంగా మారింది. పలు సంచలన కేసును వాదించిన ఈ లాయర్ బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.అయితే ఆమెను బిగ్‌బాస్ నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా భారీగా వస్తున్నది.

సనా రాయిస్ ఖాన్ విషయానికి వస్తే.. క్రిమినల్ లాయర్ పేరు సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదంలో మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ఆర్యన్ ఖాన్ కేసులో తన వాదనలు వినిపించారు. దాంతో ఆమె పేరు లీగల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అలాంటి పాపులారిటీతోనే ఆమె బిగ్‌బాస్‌లోకి వచ్చింది.
అయితే బిగ్‌బాస్ ఇంటిలో రకరకాల వివాదాస్పద కామెంట్లు చేస్తున్న సనా రాయిస్ ఖాన్ వివాదాల్లో ఇరుక్కొనేలా చేశాయి. హౌస్‌లో ఆర్యన్ ఖాన్ పేరు వాడుకోవడంపై లీగల్ సెక్టార్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిసిటీ కోసం ఆమె ఆర్యన్ ఖాన్ పేరు వాడుకొంటున్నారు. అది సరికాదు అంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యూట్యూబర్ ఫైజాన్ అన్సారీ కేసు నమోదు చేశారు.

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పేరును పబ్లిసిటీ కోసం వాడుకొంటూ పాపులారిటీని సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే బిగ్‌బాస్‌లో తనకంటూ ఓటింగ్ కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి చీప్ పబ్లిసిటీ చేసినందుకు ఆమెపై 10 కోట్ల రూపాయాల పరువు నష్టం దావాను వేస్తున్నాను అని అన్నారు.
ఆర్యన్ ఖాన్‌కు సంబంధించి ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అతడితో సనా రాయిస్ ఖాన్ పాత్రేమీ లేదు. ఆర్యన్ ఖాన్‌తో మాట్లాడినట్టు చెప్పినవన్నీ అబద్దాలే. ఆమె పెద్ద ఫ్రాడ్. పబ్లిసిటీ పిచ్చితో ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ ముంబై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న ఆమె ఎలా స్పందిస్తారు? ఆమె తరుఫు టీమ్ మెంబర్స్ ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











