Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ విన్నర్ ఎవరో లీక్ చేసిన ముద్దుబిడ్డ.. ముందే అగ్రిమెంట్ చేసుకున్నారా?
బిగ్ బాస్ షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ ఎవరూ ఊహించని స్థాయిలో దూసుకెళ్తోంది. అద్భుతమైన టీఆర్పీని సొంతం చేసుకుంటూ అందరినీ అలరిస్తోంది. బిగ్ బాస్ టీం నిర్వాహకులు కూడా షోను మరింత రసవత్తరంగా మలిచేందుకు చాలానే కష్ట పడుతున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదటి వారంలో హౌస్ లో కాలు పెట్టిన చాలా మంది కంటెస్టెంట్లు గ్రూపులుగా మారి గేమ్ ఆడారు. ముఖ్యంగా ఏడో సీజన్ అనగానే గుర్తొచ్చే గ్రూపులు రెండో రెండు. అందులో ఒకటి స్పై బ్యాచ్, మరోటి స్పా బ్యాచ్. దాదాపుగా అందరికీ ఈ గ్రూపులుగా గురించి తెలిసిందే. అయితే స్టార్ మా అంటే సీరియల్ బ్యాచ్ కు చెందిన వారిని బిగ్ బాస్ ముందు నుంచి కాపాడుకుంటూ వస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
నిజానికి బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున కూడా అలాగే ప్రవర్తించారు. మరీ ఎక్కువ నెగిటివ్స్ వచ్చినప్పుడు తప్ప శోభాశెట్టిని, ప్రియాంక జైన్, అమర్ దీప్ లపై కోప్పడలేదు. కానీ స్పై బ్యాచ్ కు చెందిన పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ లపై గట్టిగా ఫైర్ అయ్యే వారు. అయితే శోభాశెట్టి చేసిన రచ్చకు ఆమె ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిందని అంతా భావించారు. అయితే ఎట్టకేలకు ఆమె 14వ వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చాకా.. ఆమెను సపోర్ట్ చేసే వారేకంటే తిట్టే వాళ్లే ఎక్కువయ్యారు.

బిగ్ బాస్ బజ్ లో అయితే గీతూ రాయల్ నీకు బిగ్ బాస్ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడంటూ నేరుగా అడిగేసింది. ఇక బయట పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆమెకు ఇవే ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. వాటికి ఆన్సర్ చేయలేక శోభాశెట్టి తడబడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది. బిగ్ బాస్ విన్నర్ అతడే అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కాన్ఫిడెంట్ గా చెప్పిన విధానం చూస్తుంటే.. బిగ్ బాస్ టీం నిర్వాహకులు ముందుగానే విన్నర్ ను డిసైడ్ చేసి ఇంట్లోకి పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎవరు గెలుస్తారని చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా స్టార్ మా బ్యాచ్ వాళ్లెవరు తనకూ సపోర్ట్ చేయలేదని... ఒకవేళ ఎవరైనా అలా ఫీల్ అయితే తనకు ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ల పేరు కూడా చెబితే బాగుంటుందంటూ కామెంట్లు చేసింది. నిజంగానే స్టార్ మా బ్యాచ్ వాళ్లు తనకు సపోర్ట్ చేసి ఇంతకాలం ఇంట్లో ఉంచితే.. వాళ్లు తననే విన్నర్ గా చేసేవారు కదా అంటూ వాదించింది. అలాగే మరికొన్ని ప్రశ్నలు అడగా.. తెలీదు, మర్చిపోయాను, గుర్తు లేదంటూ చెప్పుకొచ్చింది.

అయితే అమర్ దీప్ మే నేరుగా షో మొదటి వారాల్లో టేస్టీ తేజతో తాను టాప్ లో ఉండేట్లు అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పాడు. ఇదే విషయం గురించి శోభాను అడగ్గా.. దాని గురించి తనకు తెలియదని తెలిపింది. కాకపోతే.. టాప్ లో పల్లవి ప్రశాంత్, శివాజి, అమర్ దీప్ లు ఉండగా... శివాజి మాత్రం అస్సలే ఈ సీజన్ విన్నర్ కాలేరని బల్లగుద్ది మరీ చెప్పేసింది. అలాగే అమర్ దీప్ గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది. తనకు తెలిసినంత వరకు అమర్ దీప్ గెలిసే అవకాశం ఉందని.. అతడే గెలవాలని తాను కూడా కోరుకుంటున్నట్లు వివరించింది.


Click it and Unblock the Notifications











