ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌లతో సినిమా తీయబోతున్న హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విన్నర్ గా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, ఆయన స్నేహితులు శివాజి, ప్రిన్స్ యావర్ లు బంధం గురించి వాళ్లు ఫెయిర్ గా ఆడిన గేమ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అద్భుతమైన ఆట తీరుతో అంతకు మించిన ప్రేమాభిమానులతో సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ను సాధించుకుందీ గ్రూప్. సీరియల్ బ్యాచ్ వాళ్లు ఫౌల్ గేమ్స్ ఆడుతూ రచ్చ చేసినా వీళ్లు మాత్రం హద్దు దాటకుండా, మాట తప్పకుండా గేమ్ ఆడారు.
ముఖ్యంగా రెండో వారం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను అంతా కలిసి టార్గెట్ చేయగా... ఒక్క శివాజియే అండగా నిలబడ్డాడు. రైతుబిడ్డకు సపోర్ట్ చేస్తూ చక్కగా చక్కటి బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. అలాగే ప్రిన్స్ యావర్ కు అండగా ఉంటూ.. అతడి తిండి విషయంలో కామెంట్లు చేసే వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పాడు. ఇలా ముగ్గురూ ఒకరికొరు సాయం చేసుకుంటూ గేమ్స్ ఆడిన వీళ్లు బయటకు వచ్చాక కూడా అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరు ఏం అన్నా పట్టించుకోకుండా వారి బంధాన్ని అలాగే నిలుపుకోవాలని చూస్తున్నారు.

ఈక్రమంలోనే శివాజి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లకు తాను సాయంగా ఉంటానని పేర్కొన్నాడు. తాను సినీ ఇండస్ట్రీకి చెందిన వాడిని అని తెలిసి కూడా వారిద్దరూ ఎప్పుడూ ఆయన్ను సినిమాల్లోకి తీసుకెళ్లేందుకు సాయం చేయాలని అడగలేరట. కానీ వారికి ఉన్న టాలెంట్, యాక్టింగ్ స్కిల్స్ తనకు తెలుసని... మంచి అవకాశం వస్తే వాళ్లు స్టార్ హీరోలుగా ఎదుగుతారని అన్నారు. తన వద్ద సినిమా తీసే సత్తా లేదు కాని ఉంటే మాత్రం వాళ్లతో ఓ సినిమా చేసేవాడినని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా రైతుబిడ్డకు చక్కగా యాక్టింగ్ నేర్పించే వాళ్లు ఉంటే అతడి స్థాయి కచ్చితంగా పెరిగిపోతుందని అన్నాడు. అలాగే మోడల్ గా కొనసాగుతున్న యావర్ కూడా నటనను ఇరగదీస్తాడని.. తనకు తెలిసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు చెప్పైనా సరే వారికి అవకాశాలు వచ్చేలా చేస్తానని అన్నారు. వాళ్లు అడగలేదని.. తానే ఈ నిర్ణయం తీసుకున్నానని శివాజి వెల్లడించాడు. ఇది ఏదో తాను ఫేమ్ కోసం చేయట్లేదని.. తన స్నేహితుల్లో ఇలా టాలెంట్ ఉన్నా వాళ్లకు చెప్పకుండా సాయం చేసేవాడిని అని వివరించాడు.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్లు ఎప్పటికీ తన బిడ్డలేనని... వారిని ఎదుగుతుంటే చూసి మురిసిపోయే వాళ్లలో తాను ముందుంటానని శివాజి అన్నాడు. వారి గెలిచేందుకు తాను చేయాల్సిందంతా చేస్తానని పేర్కొన్నాడు. అలాగే ప్రశాంత్ అరెస్ట్ అయినప్పుడు తాను అక్కడకు వెళ్లకపోవడాన్ని అంతా తప్పుగా చూశారని.. కానీ తాను ఏ చేస్తున్నాననేది ఎవరికీ తెలియదంటూ స్పష్టం చేశాడు. తాను ఏం చేసినా పది మందికి తెలిసేలా చేయనని పని జరిగిపోతే చాలని శివాజి వివరించాడు.


Click it and Unblock the Notifications











