శివాజి వివాదాస్పద వ్యాఖ్యలు: అమర్‌ను కొట్టాలి.. ఎందుకురా వెధవ అలా చేశావ్ అంటూ!

తెలుగు బుల్లితెరపై ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్థాయిలో రేటింగ్‌ను రాబడుతూ నెంబర్ వన్ షోగా హవాను కొనసాగిస్తూనే వెళ్తోంది బిగ్ బాస్. అందుకే నిర్వహకులు ఏకధాటిగా సీజన్లను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇటీవలే ఏడో సీజన్‌ను నడిపించారు. ఇందులో ఎవరూ ఊహించని ఎన్నో సంఘటనలు జరిగాయి.

ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌తో అమర్‌దీప్ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరో శివాజి దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో మీరే చూసేయండి మరి!

Bigg Boss Contestant Sivaji Sensational Comments on Amardeep Chowdary

శివాజి సెకెండ్ రన్నరప్‌గా: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో శివాజి ఆరంభంలోనే టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆటతీరుతో పాటు మైండ్‌గేమ్‌ను ప్రదర్శించాడు. ఫలితంగా గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడు గెలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు.

ఇంటర్వ్యూల్లో క్లారిటీగానే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అదరగొట్టిన శివాజి.. షో ముగిసిన తర్వాత చాలా రోజుల పాటు బయటకు రాలేదు. కానీ, వారం రోజులుగా మాత్రం అతడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాల్లోనూ భాగం అవుతున్నాడు. వీటిలో బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన ఎన్నో ఘటనలపై శివాజి క్లారిటీ ఇస్తున్నాడు.

వాడిని టార్చర్ చేసేశారు: బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజి తాజాగా ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో షోలో ఉన్నప్పుడు అమ్మాయిలపై చేసిన కామెంట్ గురించి యాంకర్ ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. 'నేను ఆ కామెంట్ చేసింది వాళ్ల బిహేవియర్‌ను బట్టే. దీనికితోడు మూడు వారాలుగా ప్రశాంత్‌ను టార్చర్ చేశారు. అన్నింటి వల్ల అలా అనాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చాడు.

వాడిపై కంట్రోల్ తప్పారు: ఇదే ఇంటర్వ్యూలో ప్రశాంత్ - అమర్‌దీప్ మధ్య జరిగిన గొడవను శివాజి ప్రస్తావించాడు. '14వ వారంలో అనవసరంగా ప్రశాంత్‌పై అమర్‌ గొడవకు దిగాడు. ఆ సమయంలో కంట్రోల్ తప్పి మరీ వాడు ప్రవర్తించాడు. అయినా ప్రశాంత్ మాత్రం పరిధి దాటలేదు. నేను వాడి పక్కనే ఉన్నాను. దీంతో ఇంకా ధైర్యంగా మాట్లాడాడు. కానీ, లైన్ మాత్రం క్రాస్ చేయలేదు' అని వివరించాడు.

Bigg Boss Contestant Sivaji Sensational Comments on Amardeep Chowdary

మెడ పట్టుకుంటే నాకేమో: ఆ తర్వాత శివాజి కంటిన్యూ చేస్తూ.. 'ఆ గొడవ జరిగిన తర్వాత బిగ్ బాస్‌కు కంప్లైంట్ చేయడానికి వెళ్దాం అని ప్రశాంత్ అన్నాడు. అప్పుడు అమర్ వాడి మెడ పట్టుకుని ముందుకు తోసేశాడు. అప్పుడు నేను లేచి అమర్‌ను నాలుగు పీకుదాం అనుకున్నా. ఉంటే ఉంటాం పోతే పోతాం అని కొట్టాలని ఆలోచన వచ్చింది. అంతలా వాడు బిహేవ్ చేశాడు' అని వెల్లడించాడు.

వెధవ ఉండి ఎందుకురా: ఈ విషయంపై శివాజి మాట్లాడుతూ.. 'ఈ ఇష్యూలో అమర్‌ను కొడదాం అనుకున్నా. కానీ, స్టార్ మా అగ్రిమెంట్ మీద చేసిన సైన్ గుర్తొచ్చింది. నా వ్యక్తిత్వం నన్ను ఆపేసింది. అప్పుడు ఛీ వెధవ.. ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేని వాడివి ఇంకా ఎందుకురా ఈ షోలో ఉన్నావని నన్ను నేనే తిట్టుకున్నా. ఇలాంటి ఇష్యూలు జరిగినా వాళ్లనే హీరోలను చేశారు' అని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X