గుండెపోటుతో బిగ్‌బాస్ కంటెస్టెంట్ కన్నుమూత.. మరణానికి ముందు ఇన్స్‌టాగ్రామ్‌లో..!

బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ ఇకలేరు. గుండెపోటుతో ఆమె గోవాలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆమె మరణించారని గోవా పోలీసులు ధృవీకరించారు. సోనాల్ ఫోగట్ మరణం, వ్యక్తిగత వివారాల్లోకి వెళితే..

హర్యానా రాష్ట్రానికి చెందిన సోనాలి ఫోగట్ టిక్ టాక్ స్టార్‌గా సుపరిచితులు. టిక్ టాక్ వీడియోల ద్వారా భారీగా ప్రేక్షకుల ఆదరణను పొందారు. 2016లో అమ్మా: ఏక్ మా జో లాఖో కే లియే బనీ అమ్మా అనే షో ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. ది స్టోరి ఆఫ్ బద్మాష్‌ఘర్ వెబ్ సిరీస్‌లో నటించారు.

Bigg Boss Contestant Sonali Phogat died due to heart attack

2020లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ 14లో పాల్గొన్నారు. హర్యానాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అదమ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై కులదీప్ బిష్ణోయిపై పోటీ చేశారు.

2020లో హిస్సార్‌లో మార్కెట్ కమిటీ అఫీషియల్‌పై దాడి చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. అలాగే కొందరిపై కూడా సోనాల్ చేయిచేసుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Bigg Boss Contestant Sonali Phogat died due to heart attack

తన మరణానికి కొద్ది గంటల ముందు ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు వైరల్ అయింది. గులాబీ రంగు డ్రస్సులో ముఖానికి చున్నీ అడ్డంగా పెట్టుకొని ఫోటోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X