ఆమె కనిపిస్తే చాలు మగాళ్లు కుక్కల్లాగా... బిగ్‌బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న కార్యక్రమాల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఒకటి. ప్రతి ఆదివారం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. జబర్దస్త్ కమెడియన్లు, ఇతర నటీనటులు చేసే స్కిట్లు ఆకట్టుకుంటున్నాయి. రష్మీ గౌతమ్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు. ప్రతి వారం ఏదో ఒక కాన్సెప్ట్‌తో ముందుకు వస్తూ.. హైపర్ ఆది పంచ్‌లు, ముద్దుగుమ్మల అందాలు ఈ కార్యక్రమానికి ఆదరణ పెంచుతున్నాయి. తాజాగా ఈ షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీసత్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మెడిసిన్ వదిలేసి మోడల్‌గా
విజయవాడకు చెందిన శ్రీసత్య.. మెడికల్ స్టూడెంట్. సినిమాలపై పిచ్చితో ఎంబీబీఎస్‌ను మధ్యలోనే వదిలేసి మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. తొలుత మిస్ విజయవాడగా, మిస్ ఆంధ్రగా ఎంపికైంది. పలు సంస్థలకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించి మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సమయంలోనే సినిమా పరిశ్రమ నుంచి శ్రీసత్యకు కబురొచ్చింది. తొలుత రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది శ్రీసత్య. అలాగే గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్, తరుణం తదితర వెబ్ సిరీస్‌లతో యువతలో గుర్తింపు తెచ్చుకుంది.

Bigg Boss contestant Sri Satya comments on her sister beauty and glamour in Sridevi Drama Company

సీరియల్స్, సినిమాలతో హవా
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తున్న క్రమంలో సీరియల్స్‌లోనూ శ్రీసత్యకు అవకాశాలు పోటెత్తాయి. ముద్ద మందారం, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయని సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించింది. 2021లో తొందరపడకు సుందర వదనా అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రీసత్య నటించారు. అదే ఏడాది జీ తెలుగులో ప్రసారమైన రియాలిటీ షో సూపర్ క్వీన్‌లో ఓ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ రావడం ఈమె కెరీర్‌ను మలుపు తిప్పింది. తన గేమ్, టాస్క్‌లు, మైండ్ గేమ్‌తో దుమ్మురేపిన శ్రీసత్య గ్రాండ్ ఫినాలేకు అడుగు దూరంలో ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ ద్వారా శ్రీసత్య జనాలకు బాగా నోటెడ్ అయ్యారు.

ఆధార్ కార్డ్ ఫోటోపై పంచ్‌లు
బిగ్‌బాస్ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు చేసిన శ్రీసత్య ఎప్పటిలాగే బుల్లితెరపైనా తన హవా చూపిస్తోంది. పలు ఛానెల్స్‌లో స్పెషల్ ప్రోగ్రామ్‌లు చేస్తూ అలరిస్తోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ తన అందం, పంచ్‌లతో వినోదాన్ని పంచుతున్నారు శ్రీసత్య.. కొద్దిరోజుల క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆధార్ ఫోటో, ఒరిజినల్ ఇమేజ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఎపిసోడ్ ప్రేక్షకులను నవ్వించింది. ఒక్కొక్క కమెడియన్ ఫోటోను స్క్రీన్‌పై ప్రదర్శించగా.. వాటిపై హైపర్ ఆది పంచ్‌లు విసిరాడు.

నన్నెవరూ పట్టించుకోలేదు
తొలుత పొట్టి నరేష్, బుల్లెట్ భాస్కర్, ప్రేరణ కంభం, అప్పారావు, అశ్విని ఫోటోలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళంపల్లి శ్రీసత్య అంటూ ఫోటో స్క్రీన్‌పై వచ్చింది. ఆమెను చూడగానే సో క్యూట్‌ అంటూ ఇంద్రజ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ ఫోటోను చూస్తే నైన్త్ క్లాసో, టెన్త్ క్లాసో అనుకుంటారు అని శ్రీసత్య చెప్పింది. నా జీవితంలో చూసిన మొట్టమొదటి అందమైన ఆధార్ కార్డ్ ఇదేనని బుల్లెట్ భాస్కర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. కొమరం అయితే శ్రీసత్యకు ఐ లవ్ యూ చెప్పేశాడు. చిన్నప్పుడు కుర్రాళ్లంతా మా అక్క వెనుక పడేవాళ్లు, నన్ను ఎవరూ చూసేవాళ్లు కాదు అని చెప్పింది శ్రీసత్య. అప్పుడు వాళ్లు చూసేవాళ్లు కాదు, ఇప్పుడు చూస్తానంటే నువ్వు ఒప్పుకోవడం లేదని హైపర్ ఆది పంచ్ విసిరడంతో అందరూ నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా .. శ్రీసత్య అందంపై నెటిజన్లు కాంప్లిమెంట్ ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X