Testy Teja: ప్రియాంక జైన్ ఇంట్లో టేస్టీ తేజకి హార్ట్ ఎటాక్... షాక్ కలిగిస్తున్న వీడియో!
టేస్టీ తేజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్, యూబ్యూబ్ వీడియోలతో టేస్టీ తేజ తెలుగు వారికి సుపరిచితమే. అయితే బిగ్ బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తర్వాత పుల్ పాపులర్ అయిపోయాడు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చకా ఫుడ్ వ్లాగ్ చేసుకుంటూ బిజీ అయిపోయాడు టేస్టీ తేజ. అయితే టేస్టీ తేజ ఫ్యాన్సుకు బ్యాడ్ న్యూస్. ఆయనకు ప్రియాంక జైన్ ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....
టేస్టీ తేజ బుల్లితెర, యూట్యూబ్ వ్యూవర్స్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన ఫుడ్ వీడియోలతో టేస్టీ తేజా బాగా పాపులర్ అయిపోయాడు. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా సందడి చేశాడు. ఇక అందులో శోభాశెట్టితో స్నేహం చేస్తూ.. బాగానే 10వారాలకు పైగానే ఉండాడు. ఇక బయటకు వచ్చాక టేస్టీ తేజ... తన ఫుడ్ వీడియోలతో బిజీగా మారిపోయాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, హీరోలు, హీరోయిన్లతో టేస్టీ తేజ ఫుడ్ వీడియోలు చేసుకుంటూ బీజీ అయిపోయాడు.

అయితే ఇప్పుడు టేస్టీ తేజ గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. టేస్జీ తేజాకి హార్ట్ అటాక్ వచ్చిందని... అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోను ప్రియాంక జైన్, శివకుమార్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. అసలు విషయం ఏంటంటే... ప్రియాంక జైన్- శివకుమార్ లను కలిసేందుకు టేస్టీ తేజ వాళ్లింటికి వెళ్లాడు. ముందుగా ప్రియాంకతో కాసేపు మాట్లాడాడు.
ఆ తర్వాత ప్రియాంకకు వంటలో సాయం చేస్తానని చెప్పిన తేజ.... శివకుమార్ తేజాకి స్పెషల్ కర్బూజా జ్యూస్ తాగిస్తాడు. అది తాగిన తర్వాత తనకు ఏదో అనీజీగా ఉందని తేజా చెప్పుకువస్తాడు. ఈలోపు శివకుమార్, ప్రియాంక జైన్.. వంటగదిలో పనులు మొదలు పెడతారు. క్యారెట్లు కోస్తున్న సమయంలో తేజా తనకు బాలేదు అని చెప్తాడు. గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. తనకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తాడు.

ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక జైన్ ఆందోళన పడుతుంది. కానీ.. శివకుమార్ మాత్రం ఎంతో కూల్ గా ఉండిపోతాడు. ఎందుకంటే టేస్టీ తేజాకి నిజమైన హార్ట్ అటాక్ రాదు.. ప్రియాంకను భయపెట్టేందుకు శివకుమార్ ఇలా తేజాతో కలిసి ప్రాంక్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయాన్ని వీడియో స్టార్టింగ్ లోనే చెప్తాడు శివ కుమార్. కానీ, ప్రియాంక మాత్రం ఎంతో కంగారు పడిపోతూ... అంబులెన్స్ కు కాల్ చేయాలని అనుకుంటుంది.
కానీ శివ కుమార్ ఫోన్లు కూడా దాచిపెట్టి.. ప్రియాంకకు మరింత టెన్షన్ కలిగిస్తాడు. దాంతో ప్రియాంకకు ఏం చేయాలో అర్థంకాదు. చివరకు ప్రియాంక టెన్షన్ చూసి... అసలు విషయం చెప్తాడు టేస్టీ తేజ. ఆ తర్వాత ప్రియాంక కాస్త కూల్ అయి... రివర్స్ లో శివకుమార్ ను కొడుతుంది. మొత్తానికి శివకుమార్ అనుకున్నది సాధించాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.. గతంలో ప్రియాంక కూడా శివకుమార్ పై ఇలాంటి ప్రాంకులు చాలానే చేయగా.. ఇప్పుడు శివకుమార్ చేశాడు. మొత్తానికి ప్రాంక్ వీడియోతో నెటిజన్లను కూడా భయపెట్టారు.


Click it and Unblock the Notifications











