ట్రాన్స్‌జెండర్‌గా ఆపరేషన్ .. నా మొహం చూసుకుని, స్టేజ్‌పైనే ఎమోషనలైన బిగ్‌బాస్ పింకీ
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా పాపులారిటీ సంపాదించారు ప్రియాంకా సింగ్ అలియాస్ పింకీ . ఆమె ట్రాన్స్‌జెండర్ . గతంలో ఆమె అబ్బాయి.. అసలు పేరు సాయితేజ. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా పింకీ పాపులర్ అయ్యింది. అచ్చుగుద్దినట్లు అమ్మాయిలా ఉండే సాయి.. తాను సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారినట్లుగా తెలిపింది. బిగ్‌బాస్ తర్వాత బయట పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు . తాజాగా ఈటీవీలో ప్రసారమైన ఓ షోలో ఆమె ట్రాన్స్‌జెండర్‌గా మారినప్పటి రోజులను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంకా సింగ్ .. బిగ్‌బాస్ 5లో అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పేసింది. దీంతో తమన్నా సింహాద్రి తర్వాత బిగ్‌బాస్ తెలుగులో అడుగుపెట్టిన సెకండ్ ట్రాన్స్‌జెండర్‌గా పింకీ నిలిచింది. ఎలాంటి అంచనాలు కానీ, ఫ్యాన్ సపోర్ట్ కానీ లేకుండా హౌస్‌లోకి వచ్చిన ప్రియాంక దాదాపు 91 రోజులు హౌస్‌లో ఉండటం మామూలు విషయం కాదని విశ్లేషకులు ఆశ్చర్యపోయారు.

బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు తన కో కంటెస్టెంట్ మానస్ నాగులపల్లిని ఎంతో ఇష్టపడింది ప్రియాంక. హౌస్‌లో ఉన్నంతసేపూ అతని వెంటే తిరిగింది. వంట చేయడమంటే ఇష్టమని చెబుతూ బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు కిచెన్‌లో గడిపేది. ఇంటి సభ్యులకు తన చేతి వంట రుచిచూపిస్తూ అందరి అభిమానాన్ని సంపాదించింది. ఎవరైనా తనను నామినేట్ చేస్తే వెంటనే వారిని తిరిగి నామినేట్ చేసి బదులు తీర్చుకునేది. తాను వంట చేసి పెడితే తిని.. తనను గేమ్ ఆడలేదనడం కరెక్ట్ కాదంటూ షణ్ముఖ్ జస్వంత్‌పై ప్రియాంక మండిపడింది. చాలా టాస్క్‌ల్లో పాల్గొని గెలిచినప్పటికీ కెప్టెన్ కాకుండానే ఆమె హౌస్‌ను వీడింది.
తాను సాయితేజ నుంచి ప్రియాంకగా మారడం దైవ నిర్ణయం అంటుందని ఆమె తరచుగా చెబుతుంటారు. ట్రాన్స్‌జెండర్‌గా మారాలని నిర్ణయించుకున్న తర్వాత హైదరాబాద్ పెద్దమ్మ సన్నిధిలో రూపాయి కాయిన్ నిలబెట్టి అమ్మవారినే తీర్పు కోరగా.. రూపాయి కాయిన్ నిలబడటంతో మంబై వెళ్లి ఆపరేషన్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లుగా ప్రియాంక బిగ్‌బాస్ షోలోనే చెప్పింది. బిగ్‌బాస్ షోలో ఉన్నందుకు గాను వారానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల చొప్పున మొత్తంగా రూ.25 లక్షలను వెనకేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ ఎపిసోడ్‌కు ప్రియాంకా సింగ్ వచ్చింది. ఈ సందర్భంగా వారికి సర్‌ప్రైజ్ అంటూ హోస్ట్ సుధీర్ చెబుతాడు. ప్రియాంక వెనక్కి తిరిగి నిల్చోగా.. ఆమె బెస్ట్‌ఫ్రెండ్ నిష వచ్చి హగ్ చేసుకుంటుంది. పింకీ గురించి ఎవరికీ తెలియని విషయం చెబుతున్నానంటూ .. ఆమెకు మ్యాచ్ సెట్ అయ్యిందని అంటుంది. ప్రియాంక సిగ్గుపడుతుండగా సుడిగాలి సుధీర్.. షీ ఈజ్ సిగ్గింగ్ రే అనగా అంతా నవ్వేస్తారు.
తాను కూడా సర్జరీ చేసుకుని ట్రాన్స్‌జెండర్‌గా మారానని.. మా ఇద్దరికీ ఎవరూ లేరని నిషా అంటుంది. ఆసుపత్రిలో బెడ్స్‌పై ఒకరి మొహం మరొకరు చూసుకుని ఏడుస్తూనే ఉన్నామని ప్రియాంక చెప్పగా.. మా అమ్మ మాత్రమే తాను ట్రాన్స్‌జెండర్‌గా మారతానంటే యాక్సెప్ట్ చేసిందని నిషా అంటుంది. ఆ మాటలతో సుధీర్ సహా స్టేజ్ పై ఉన్న వారంతా కంటతడి పెడతారు. మరి ప్రియాంక లైఫ్‌లోని ఇంపార్టెన్స్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 8 వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











