Bigg Boss బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. ఫంక్షన్‌లో ఉండగానే అదుపులోకి
చిత్ర విచిత్ర వేషధారణ, దుస్తులు ధరిస్తూ మీడియాను విశేషంగా ఆకర్షిస్తున్న ఉర్ఫీ జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. అశ్లీల, అసభ్య రీతిలో దుస్తులు ధరిస్తున్నారనే ఆరోపణలపై ఆమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గత కొద్దికాలంగా ఉర్ఫీ జావెద్‌ను ఈ విషయంలో హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె హెచ్చరికలను ఆమె బేఖాతరు చేసింది. ఈ క్రమంలో ముంబై పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు గురించిన వివరాల్లోకి వెళితే..

గత కొద్ది రోజులుగా బరితెగించినట్టు ఉర్ఫీ దుస్తులు ధరిస్తూ ముంబై వీధుల్లో హల్‌చల్ చేసింది. గత రెండు రోజులుగా ఆమె ధరించిన డ్రస్సులు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో ముంబై వాసుల ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











