మగాడిలో ఆ మేటర్ చెక్ చేయాల్సిందే... హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆడవాళ్లే పెళ్లి చేసుకునే విధానం ఇటీవల పూర్తిగా మారిపోయింది. గతంలో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరిని చెబితే వారినే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం తమకు నచ్చినవారిని అన్ని విధాలా సెట్ అయితేనే పెళ్లి చేసుకుంటున్నారు. నచ్చకపోతే నచ్చలేదని కరాకండీగా చెప్పేస్తున్నారు. ఎవరు బలవంతం చేసినా ఈ విషయంలో తగ్గేదే లేదని అంటున్నారు మగువలు. తాజాగా పెళ్లి, రిలేషన్‌పై ఓ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బుల్లితెరపై స్టార్
హిందీ బుల్లితెరపై టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు వాబిజ్ దొరబ్జీ. పూణేలో పార్సీ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ... ప్యార్ కీ యే ఏక్ కహానీ సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత సావిత్రి, సరస్వతిచంద్ర, బాహు హమారీ రజనీకాంత్, హికప్స్ అండ్ హుకప్స్, దీవానియాత్ అనే సీరియల్స్‌లో నటించారు. 2017లో వాబిజ్ హోస్ట్‌గా ప్రసారమైన షోబిజ్ విత్ వాబిజ్ అనే టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుల్లితెర, వెండితెరకు చెందిన పలువురు టాప్ స్టార్స్‌ను వాబిజ్ ఇంటర్వ్యూ చేసే విధానం, అల్లరి బాగా పాపులర్ అయ్యాయి.

వివియన్‌తో పెళ్లి, విడాకులు
కాగా.. ప్యార్ కీ యే ఏక్ కహానీ సీరియల్‌లో తన సహనటుడు వివియన్ దిసేనతో ప్రేమలో పడిన వాబిజ్... పెద్దల అంగీకారంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఈ జంట పరస్పర అంగీకారంతో 2016లో విడాకులు తీసుకున్నారు. నాటి నుంచి ఎవరి దారులు వారివి అయ్యాయి. విడాకుల తర్వాత ఎప్పటిలాగే ఇద్దరూ సీరియల్స్, ఇతర కార్యక్రమాలలో బిజీ అయ్యారు. వాబిజ్ ఒంటరిగానే జీవితం కొనసాగిస్తుండగా.. దిసేన మాత్రం నౌరాన్ అలే అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు.
భరణంపై ట్రోలింగ్
మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ... కుండబద్ధలు కొట్టడంలో వాబిజ్ ముందువరుసలో ఉంటారు. ఆమె చేసిన పలు కామెంట్స్ కూడా కలకలం రేపాయి. ఇటీవల సుప్రీంకోర్ట్ వీధి కుక్కలపై ఇచ్చిన ఆదేశాలపైనా వాబిజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు.. వివియన్‌తో విడాకుల తర్వాత వాబిజ్‌పై భారీగా ట్రోలింగ్ జరిగింది. పెద్ద ఎత్తున ఆమె భరణాన్ని డిమాండ్ చేసిందని, వివియన్‌ని వేధించిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటికి ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు . తాజాగా వాబిజ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, విడాకులు, రిలేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమ్మాయిలకు ఆ హక్కుంది
ఓ వ్యక్తి నాకు కుచ్చుటోపీ పెట్టాలని చూశాడు.. నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి రెండు మూడు సార్లు డబ్బు గుంజాడు. నా డబ్బు, ఆస్తిపై అతని కన్నుపడింది ఇలాంటి వారిని గోల్డ్ డిగ్గర్స్ అంటారు. ప్రస్తుతం చాలా మంది మగాళ్లు.. అమ్మాయిల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని మనతో మాట కలుపుతున్నారు. వారికి డబ్బు అవసరం అయినప్పుడల్లా మొహమాటం లేకుండా అడుగుతున్నారు. అమ్మాయిలు కూడా పెళ్లికి ముందే జీవిత భాగస్వామి గురించిన అన్ని వివరాలు తెలుసుకోవాలి. అతనిలో స్థిరత్వం, ఆర్ధిక భద్రత ఉందా ? లేదా ? అనేది కూడా చూడాలి. ఇలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిల్ని గోల్డ్ డిగ్గర్స్ అనే ముద్ర వేయడం తప్పు, ఆమెలో ఎలాంటి చెడు ఉద్దేశం లేదని వాబిజ్ దొరబ్జీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











