Bigg Boss అతను నిన్ను వాడుకొని వదిలేస్తాడు.. బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్ల సిగపట్లు
బిగ్‌బాస్ హిందీ సీజన్ 17 రసవత్తరంగా సాగుతున్నది. కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం, ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్ ఈ షోను మరింత క్రేజీగా మలిచింది. బిగ్‌బాస్ ఇంటిలో కంటెస్టెంట్‌గా ఉన్న తెలుగు హీరోయిన్ మన్నారా చోప్రా, బాలీవుడ్ నటి, టెలివిజన్ యాక్టర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే మధ్య భారీగా జరిగిన వాగ్వాదం చూస్తే ఇంటిలో జరుగుతున్న విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంటిలో టైటిల్ రేసులో ఉన్న ఓ కంటెస్టెంట్ గురించి మన్నారా, అంకితా మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ 17 విజేతగా నిలువడానికి అవకాశం ఉన్న వారిలో మునావర్ ఫరూఖీ ముందు వరుసలో ఉన్నాడు. ఇంటిలో మన్నారా చోప్రాతో సన్నిహితంగా ఉంటూ రొమాంటిక్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా మునావర్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి.. ఇంటిలో నీకు ఇష్టమైన వారు ఎవరు? అని అడిగితే.. అంకితా లోఖండే, మన్నారా చోప్రా, అభిషేక్ కుమార్ అని మూడు పేర్లు చెప్పాడు.

మునావర్ తనకు ఇష్టమైన ముగ్గురి పేర్లు చెప్పడంతో ఇంటిలో మన్నారా, లోఖండే మధ్య గొడవ ప్రారంభమైంది. అంకితా మాట్లాడుతూ.. ఎప్పుడైతే మునావర్ నా పేరు చెప్పాడో అప్పుడే నీకు జెలసీ క్రియేట్ అయింది. అదే నీకు ప్రాబ్లెం. అక్కడి నుంచే నీవల్ల నాకు సమస్యలు మొదలయ్యాయి అని ఘాటుగా స్పందించింది.
అంకితా లోఖండే మాటలకు అడ్డుపడుతూ.. మునవార్ నిన్ను వాడుకొంటున్నాడు. ఆ విషయం నీకు తెలియడం లేదు అని మన్నారా అంటే.. నా విషయం పక్కన పెట్టు.. నిన్ను ఎవరు వాడుకొంటున్నారో అది గ్రహించు అంటూ అంకితా లోఖండే ఘాటుగా జవాబిచ్చింది. దాంతో నన్ను ఎవరు వాడుకొంటే నీకు ప్రాబ్లెం అంటూ మన్నారా తిరిగి జవాబిచ్చింది.

మునావర్ నా ఫ్రెండ్ చెప్పుకొనే దానివి. నిన్ను వాడుకొని వదిలేస్తాడు అని నాకు పదే పదే చెప్పావుగా.. నీ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు నిన్ను అతను వాడుకొని వదిలేసే వాడిలా కనిపిస్తున్నాడు అని అంకితా ప్రశ్నించింది. దాంతో ఎదుటి వారిని అవమానించడం తేలిక.. కానీ తమ తప్పులు తెలుసుకోవడం కష్టం అని మన్నారా ఫైర్ అయింది.
ఇదిలా ఉండగా.. మన్నారా చాలా డేంజర్. ఆమెను టచ్ చేస్తే కరెంట్ షాక్ కొడుతుంది బిగ్‌బాస్. ఈ షోలో ఒకరికి విజయం దక్కితే.. మరొకరు పరాజయం పాలవుతారు. అందుకే నేను అందరికి సమాన దూరంలో ఉంటాను అని మునావర్ అంటే.. ఇంటిలో గొడవలు పెట్టి నీవు ఆడియెన్‌గా మారి ఎంజాయ్ చేస్తున్నావు అంటూ బిగ్‌బాస్ అంటూ కనిపించాడు. ఈ గొడవ ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











