Bigg Boss: బిగ్‌బాస్‌లో సెల్ఫ్ గోల్.. మధ్యలోనే చేతులెత్తిసిన కంటెస్టెంట్లు వీరే! సంపూ, మణికంఠ ఇంకా ఎవరంటే?

బిగ్‌బాస్ రియాలిటీ షోలో సుమారుగా 15 వారాలపాటు ఇంటిలో ఉండాలంటే అన్ని రకాలుగా సిద్దమై పోవాల్సిందే. మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటేనే.. ఆ షోలో ఉండే ఒత్తిడి, కంటెస్టెంట్ల నుంచి ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే చాన్స్ ఉంటుంది. ఇవే కాకుండా బయటి ప్రపంచానికి దూరంగా, కుటుంబ సభ్యులు, ఫోన్లు, వినోదానికి దూరంగా ఉండటమంటే కత్తి మీద సామే. అయితే ఇలాంటి షో నుంచి తమకు తాముగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల వివరాల్లో వెళితే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆరంభంలోనే ఈ షో మంచి రేటింగ్ సంపాదించుకొన్నది. ఈ షోలోకి వచ్చిన తెలుగు హీరో సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ తన ఆటతో ఆకట్టుకొన్నాడు. కానీ షో ప్రారంభమైన తర్వాత 9 రోజులకే హౌజ్ నుంచి ఇంటికి వెళ్లిపోతానని గొడవ చేశాడు. దాంతో ఆయనకు బిగ్‌బాస్, ఇతర సభ్యులు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కానీ తన పట్టు వదలకపోవడంతో అర్ధాంతరంగా సంపూ ఇంటి నుంచి బయటకు వచ్చారు.

Bigg Boss Contestants Who walked out with Self Elimination from Bigg Boss Telugu Seasons

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకొన్నది. నటుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నూతన్ నాయుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 54వ రోజు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 68వ రోజున చేతికి గాయం, ఆరోగ్య సమస్యలతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన షోలో 68వ బయటకు వచ్చారు.

ఇక బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కూడా ఆరోగ్య సమస్యలతో నోయెల్ సీన్ అర్ధాంతరంగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్‌లో తొలి రోజునే అడుగుపెట్టిన ఆయన ఇంటిలో టాప్ ఫెర్ఫార్మెన్స్‌ను ఇచ్చాడు. అయితే నరాలకు సంబంధించిన సమస్యల కారణంగా ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో 53వ రోజున ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

Bigg Boss Contestants Who walked out with Self Elimination from Bigg Boss Telugu Seasons

తెలుగు బిగ్‌బాస్ రియాలీటి షోలో ఇప్పటి వరకు అత్యధిక వయస్సున కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అడుగుపెట్టిన యూట్యూబర్ గంగవ్వ షోలోకి వచ్చిన తర్వాతా సుమారుగా 5 వారాలు ఇంటిలో ఉన్నారు. అయితే హౌస్‌ ఉండే ఏసీ కారణంగా, జర్వం, ఇతర సమస్యల కారణంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె 5 వారాల తర్వాత అంటే 34వ రోజున ఇంటి నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం 8వ సీజన్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా ఉన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌లో మోడల్ జస్వంత్‌ షణ్ముఖ్‌కు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. టాప్ కంటెస్టెంట్‌గా రాణిస్తున్న సమయంలో ఉన్నట్టుండి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. దాంతో వైద్యులు పలుమార్లు పరీక్షించారు. కొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. కానీ తప్పనిసరిగా బయటకు రావడంతో సెల్ఫీ ఎలిమినేషన్‌తో బయటకు వచ్చారు.

తాజాగా మణికంఠ కూడా ఆరోగ్య కారణాలతో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌ నుంచి బయటకు వచ్చారు. ఇంటిలో కీలక సభ్యుడిగా ఉన్న టెలివిజన్ యాక్టర్ టాస్కులలో ఉండే ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఫిజికల్ టాస్క్‌లు తన వల్ల కావడం లేదని చెప్పి సెల్ఫ్ ఎలిమినేషన్ విధించుకొన్నాడు. అయితే ఆడియెన్స్ ఓటింగ్‌లో ఆయన ఈవారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ కావడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X