Bigg Boss: 2 కోట్లు కట్టండి.. బిగ్‌బాస్ నిర్వాహకులకు హీరోయిన్ షాక్

భారతదేశంలో మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అంటే టక్కున వినిపించే పేరు బిగ్‌బాస్. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ టాప్ షో ఇప్పుడు ప్రాంతీయ భాషలకు విస్తరించి ప్రజల ఆదరణను దక్కించుకుంటోంది. బిగ్‌బాస్‌లో పాల్గొనాలని ఎంతోమంది కల. ఈ షో ద్వారా పాపులర్ అయి మంచి పొజిషన్‌లో ఉన్న వారు ఉన్నారు. అయితే మంచితో పాటు బిగ్‌బాస్ చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. పెళ్లి కానీ యువతీ యువకులను ఒకే గదిలో 3 నెలల పాటు ఉంచడం సరికాదని.. పైగా ఈ షోలో మితిమీరిన రొమాన్స్, అశ్లీలత ఉన్నాయంటూ సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ నిర్వాహకులకు షాకిచ్చింది స్టార్ హీరోయిన్. ఈ వివరాల్లోకి వెళితే..

హిందీ, మరాఠీ చిత్రాలతో ఫేమస్ అయ్యారు నటి సోనాలి రౌత్. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కోసం స్విమ్ సూట్‌లో ఈ ముద్దగుమ్మ చేసిన ఫోటో షూట్ వైరల్ అయ్యింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి చేసిన ఫోటో షూట్ కూడా పాపులర్ అయ్యింది. 2014లో హిమేష్ రేష్మియా సరసన ది ఎక్స్‌‌పోజ్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు సోనాలి. ఆ వెంటనే గ్రేట్ గ్రాండ్ మస్తీలో గెస్ట్ రోల్‌లో నటించింది. అయితే తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు. దాదాపు పదేళ్ల నుంచి ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ సమయంలో బుల్లితెర, వెబ్‌సిరీస్‌లు సోనాలిని ఆదుకున్నాయి.

Bigg Boss Controversy Sonali Raut Sends Legal Notice Alleges Unhygienic Conditions in BB Marathi Season 6

లవ్ లైఫ్ అండ్ స్క్రూ అప్స్, డేంజరస్ అనే వెబ్ సిరీస్‌లతో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో సోనాలి నటించారు. 2014లో బిగ్‌బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ఫైనల్ వరకు వెళ్లింది. ఈ ఏడాది జరిగిన బిగ్‌బాస్ మరాఠీ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా వెళ్లిన సోనాలి రెండు వారాలు ముగిసేసరికి బయటకు రావడం ఆమె అభిమానులకు సైతం షాకిచ్చింది. హిందీ బిగ్‌బాస్‌లో దుమ్మురేపి.. టాప్ కంటెస్టెంట్స్‌కు సైతం చెమటలు పట్టించి, ఎంతో అనుభవం సంపాదించిన సోనాలి ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. తాజాగా బిగ్‌బాస్‌లో తన ఆటతీరుతో పాటు అన్ని సందేహాలకు సమాధానమిస్తూ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు షాకిచ్చారు సోనాలి రౌత్.

ఏకంగా 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ బిగ్‌బాస్ నిర్వాహకులకు ఆమె లీగల్ నోటీసులు పంపినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. బిగ్‌హౌస్‌లో తాను అనుభవించిన బాధ గురించి సుదీర్ఘ వీడియోతో పాటు ప్రైవేట్ ఫోటోలను షేర్ చేశారు. బిగ్‌బాస్ వాతావరణం వల్ల నా చర్మంపై తామర సోకింది. ఈ కారణంగానే 2 వారంలోనే ఎలిమినేట్ అయ్యా. 3 నెలలు గడుస్తున్నా ఈ వ్యాధితో నేను బాధపడుతూనే ఉన్నా. నిర్వాహకులపై నమ్మకంతోనే బిగ్‌బాస్ మరాఠీ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాను. కానీ అక్కడంతా అపరిశుభ్ర వాతావరణమే.. కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు తిరిగేవి, వాటితోనే మేం జీవించామని సోనాలి ఆరోపించారు.

ఆకలి, నిద్రలేమి, అపరిశుభ్రత వేధించింది. ఇతరులు వినియోగించిన టవల్స్, బెడ్‌షీట్స్, రేజర్స్ వంటివి షేర్ చేసుకోవాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదు. వీకెండ్ కా వార్ సందర్భంగా ఎండెమోల్ ప్రొడక్షన్స్ వారు కంటెస్టెంట్స్ కోసం పంపిన ఫుడ్‌లో బొద్దింకలు కనిపించాయి. పనిష్మెంట్ పేరుతో 17 మంది కంటెస్టెంట్స్‌కి కలిపి ఒకే ఒక్క వాష్‌రూమ్‌ను ఉపయోగించుకున్నాం. అందులోనే సిగరెట్లు తాగడం, మిగిలిపోయిన చికెన్, గుడ్లు, ఎక్కడపడితే అక్కడ వేయడంతో ఎలుకలు స్వైర విహారం చేశాయి. ఇలా పలు కారణాలతో నా ఆరోగ్యం దెబ్బతింది. అందుకే రెండో వారంలోనే బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించానని సోనాలి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనాలి ఆరోపణలపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X