కంటెస్టెంట్ల మధ్య గొడవతో నిప్పు రాజేసి.. చలిమంట కాచుకొన్న బిగ్‌బాస్!

బిగ్‌‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో అంచనాలకు మించి గ్రాండ్‌గా ప్రారంభమైంది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా మొదలైన ఈ షోలో తొలి రోజే భారీ ట్విస్టులు, టర్న్‌లను చూపించి.. ఈ షో ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇంటిలో మొదటి రోజే కంటెస్టెంట్లను మధ్య నిప్పు రాజేసి బిగ్‌బాస్ చలిమంట కాచుకొనే ప్రయత్నం చేశారనే ఫీలింగ్ కల్పించారు. ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య ఫైట్ వివరాల్లోకి వెళితే..

ఇంటిలో గొడవలు సృష్టించకుండా బిగ్‌బాస్ తన షోను ముందుకు తీసుకెళ్లలేరనే విషయం అందరికి తెలిసిందే. ఇంటిలో గొడవలకు దర్శకుడు అనిల్ రావిపూడిని రంగంలోకి దించాడు. ఇంటిలోకి పంపించి ఓ గేమ్ ఆడించారు. అయితే తాను సాధారణంగా లాస్ట్ వీక్ ఎలిమినేషన్‌కు వస్తాను. కానీ ఈసారి ఫస్ట్ వీక్‌లోనే అది కూడా ఫస్ట్ డే రోజున ఎలిమినేషన్‌ చేయమని ఆదేశించారు అని షాకిచ్చారు.

Bigg Boss Creates huge rift between Contestants on Day 1 of Bigg Boss Telugu Show

ఇప్పటి వరకు ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అయితే ఈ ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారు ఎవరు? అనేది అందరూ ఓటింగ్ చేయాలి అని అనిల్ సూచించారు. దాంతో ఎక్కువ మంది మణికంఠకు ఆ అర్హత లేదని ఓటు వేశారు. దాంతో ఎలిమినేషన్‌కు అతడిని సిద్దం చేసి బయటకు తీసుకెళ్లారు.

అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. మీకు వేరే వేరే ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. కానీ నాకు నేనేంటో తెలియజేయడానికి బిగ్‌బాస్ తెలుగు ఒక్కటే అవకాశం. అలాంటి దాని నుంచి ఏ కారణం లేకుండా బయటకు పంపిస్తారా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే బయటకు తీసుకెళ్తూ నీవు ఎవరి ఫ్యాన్‌వి అని అనిల్ రావిపూడి అడిగితే.. నాకు నేను ఫ్యాన్ అంటూ సమాధానం ఇచ్చాడు.

ఇక గేట్ వద్దకు తీసుకెళ్లిన ఆయన ఇదంతా ఫ్రాంక్ కాల్ అంటూ మణికంఠకు చెప్పడంతో కాస్త స్థిమిత పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయంపై భారీగానే చర్చ జరిగినట్టు కనిపించింది. నన్ను ఇంటి నుంచి బయటకు పంపిచే విషయంలో ఆ తీరు బాగాలేదు. మాట్లాడే పద్దతి బాగా లేదు. నేను ఏం చేస్తానో నాకు తెలుసు కదా.. నేను వారికి రెస్పక్ట్ ఇవ్వడం అవసరం లేదు. ఇది నా ఫీలింగ్ అంటూ మణికంఠ ఘాటుగా స్పందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X