Siri Hanumanthu: అతిచిన్న పూల డ్రెస్‌లో గులాబీ పువ్వులా బిగ్‌బాస్ బ్యూటీ.. భలే ఉందిగా!
బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం యాంకర్ గా కూడా మారి దుమ్ము లేపుతోంది. అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ... అటు టీవీ షోలో, ఇటీ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ అతిచిన్న పూల డ్రెస్ వేసుకుని గులాబీ పువ్వులా మెరిసిపోతుంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కెరియర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ లో వీడియోలు చేసేది సిరి హన్మంత్. యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అనేక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మెప్పించింది. మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో కలిసి డ్యాన్స్ వీడియోలు కూడా చేసేది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోకు వెళ్లింది. అక్కడ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చాలా క్లోజ్ గా ఉంటూ విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకుంది. అప్పటికే బయట వారిద్దరికీ ప్రేమికులు ఉండండతో మరింత ట్రోల్స్ జరిగాయి. అలా బయటకు వచ్చిన ఈ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ కు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పగా... శ్రీహాన్ మాత్రం సిరిని వదల్లేదు.

ఆ తర్వాత చాలా షోలకు హాజరు అయిన సిరి... తన ప్రియుడు శ్రీహాన్ తన గురించి అర్థం చేసుకుని, తన తప్పును మన్నించి తనతో కలిసి ఉన్నాడని చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం అతడితో కలిసి ఉంటున్న ఈ క్యూట్ బ్యూటీ.. ఫోకస్ మొత్తం కెరియర్ పైనే పెట్టింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే కామెడీ షో.. జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తోంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో పాటు జవాన్ సినిమాలోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ.
ఇలా కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అదిరిపోయే ట్రెండీ ట్రెండీ ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందాలను ఆరబోస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అతి చిన్న పూల డ్రెస్ వేసుకుని అందాలు ఆరబోసింది. చాక్లెట్ కలర్ ఫ్రాక్ పై అనేక థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ ఉండగా... చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక ఆ డ్రెస్ లో సిరి హన్మంత్ అందాలు అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు.

ప్రస్తుతం సిరి హన్మంత్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అచ్చం గులాబీ పూవులాగే కనిపిస్తున్నాంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











