Bigg Boss Telugu 8: కంటెస్టెంట్లకు మరో బ్యాడ్ న్యూస్.. అన్నం కావాలంటే అలా చేయాల్సిందే!
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌లతో షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలకు చేరువ అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. మన దగ్గర మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇలా నిర్వహకులు ఇప్పుడు ఎనిమిదో దానితో వచ్చింది. ఇందులో కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. ఆ వివరాలను మీరే చూసేయండి!
ఏడో సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో ఎనిమిదో దాన్ని మరింత విజయవంతం చేయాలని నిర్వహకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం అంతులేని వినోదం అనే కాన్సెప్టుతో ఈ సీజన్‌ను తీసుకు వచ్చారు. దీన్ని సెప్టెంబర్ 1వ తేదీన ప్రసారం అవుతోన్న లాంచింగ్ ఎపిసోడ్‌లో మొదలు పెట్టారు. ఇది కంటెస్టెంట్లు, సెలెబ్రిటీల ఎంట్రీతో ఎంతో సందడి సందడిగా సాగింది.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ గతంలో వచ్చిన వాటి కంటే భిన్నంగా ఉంటుందని ప్రోమోల్లో చూపించారు. అందుకు అనుగుణంగానే ఇందులో అన్నీ వైవిధ్యాలను చూపిస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌నే చాలా కొత్తగా చూపించారు. అలాగే, మొదటి నుంచే ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు, షాక్‌లు చూపిస్తున్నారు. ఫలితంగా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు.
ఎనిమిదో సీజన్‌లో గెస్టులుగా వచ్చిన దగ్గుబాటి రానా, నివేదా థామస్ ఓ టాస్క్ ఆడించారు. అందులో ఓడిపోయిన వాళ్లకు హోస్ట్ అక్కినేని నాగార్జున ఓ బ్యాడ్ న్యూస్ చెబుతానని అన్నాడు. ఆ తర్వాత 'ఈ సీజన్‌లో కెప్టెన్సీ అనేది ఉండదు. అంటే ఇమ్యూనిటీ కూడా లభించదు' అని షాకిచ్చాడు. అంటే ఈ సారి ప్రతి ఒక్కరూ నామినేషన్స్‌లో ఉండాల్సిన అవసరం వచ్చింది.
ప్రీమియర్ ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ కూడా గెస్టులుగా వచ్చారు. వాళ్లు మూడు జంటలతో ఓ గేమ్ ఆడించారు. అందులో కిర్రాక్ సీత, మణికంఠలు ఓడిపోయారు. దీంతో వాళ్లను నాగార్జున కాఫీ చేయమని చెప్పాడు. కానీ, అక్కడ 'నో రేషన్' అని రాసి ఉండడంతో 'ఈ సీజన్‌లో రేషన్ కూడా ఉండదు. మీకు అది కావాలంటే కచ్చితంగా ఏదో ఒకటి ఆడి గెలుచుకోవాల్సిందే' అంటూ హోస్ట్ వెల్లడించాడు. ఇలా కెప్టెన్సీ, రేషన్ కట్ చేసి బిగ్ బాస్ వరుస షాక్‌లు ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











