బిగ్‌బాస్‌కి వెళ్లి పెద్ద తప్పు చేశా.. రియాల్టీ షోపై ఫైర్ బ్రాండ్ షాకింగ్ కామెంట్స్..

తెలుగు బుల్లితెరపై అత్యధిక పాపులారిటీ సాధించిన రియాలిటీ షో 'బిగ్‌బాస్‌' ఒకటి. ప్రతి ఏడాది ఓ డిఫరెంట్‌గా ప్లాన్ తో ఈ రియాలిటీ గేమ్ షో సాగుతోంది. అయితే.. ఈ బుల్లితెర రియాలిటీ షోపై అప్పుడుప్పుడు నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా మాజీ కంటెస్టెంట్స్ కొందరు ఈ షోపై సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలా తాజా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ లోకి వెళ్లి తాను తప్పు చేశానంటూ సంచలన వ్యాఖ్యాలు చేసింది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు?

ఇంతకీ బిగ్‌బాస్ షోపై హాట్ కామెంట్స్ చేసిన మాజీ కంటెస్టెంట్ మరెవరో కాదు శ్రీజ దమ్ము (Bigg Boss Srija). బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన శ్రీజ, సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదిలేసి కామనర్స్ కోటాలో హౌస్‌లో అడుగుపెట్టింది. తొలి అగ్నిపరీక్ష నుంచే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. "ఫినాలే వరకు వెళ్తుంది" అన్న అంచనాల మధ్యే ఐదో వారంలో ఎలిమినేట్ కావడం షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Bigg Boss Dammu Srija Shocking Comments Re-Entering Bigg Boss Was a Mistake Says Season 9 Contestant

తర్వాత భరణితో కలిసి రీ-ఎంట్రీ ఇచ్చినా, వారం రోజుల్లోనే మళ్లీ బయటకు రావాల్సి వచ్చింది. భరణిని కాపాడేందుకే శ్రీజను బలి చేశారంటూ అప్పట్లో నెటిజన్లు మండిపడ్డారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తర్వాత కూడా శ్రీజ ఫుల్ బిజీగా ఉండి, టీవీ షోలు, స్పెషల్ అపియరెన్సులు, రియాలిటీ ప్రోగ్రామ్స్‌తో సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్‌తో పాటు బిగ్‌బాస్ అనుభవాలను ఓపెన్‌గా షేర్ చేయడంతో మళ్లీ వార్తల్లో నిలిచింది.

బిగ్‌బాస్ హౌస్‌లో తనకు నెగటివ్ ఇమేజ్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు శ్రీజ క్లారిటీ ఇచ్చింది. "మొదటగా నేను అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఎప్పుడూ అంగీకరిస్తూనే ఉంటాను. బిగ్‌బాస్‌కు వెళ్లకముందే ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు. బిగ్‌బాస్ అనేది చాలా మంది చూసే షో. మన సమాజంలో అమ్మాయి గట్టిగా మాట్లాడితే వెంటనే గయ్యాలి అని ముద్ర వేస్తారు. అదే అబ్బాయి మాట్లాడితే మాత్రం అది ఓకేగా తీసుకుంటారు. నాకు ఎదురుగా ఏదైనా ఇష్యూ జరిగితే మాట్లాడకుండా ఉండలేను. హౌస్‌లో జరిగిన ప్రతి విషయంపై ఓపెన్‌గా మాట్లాడాను. అది పాజిటివ్ అవుతుందా నెగటివ్ అవుతుందా అన్న ఆలోచన చేయలేదు. అదే నాకు నెగటివ్ షేడ్ తీసుకొచ్చింది," అని చెప్పింది.

అయితే ఆ తర్వాత పరిస్థితిని నెమ్మదిగా అర్థం చేసుకుని తనలో తాను మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేశానని శ్రీజ వెల్లడించింది. "కొన్ని సందర్భాల్లో సైలెంట్‌గా ఉండటం కూడా అవసరమేనని అప్పుడే అర్థమైంది," అంటూ తన జర్నీ గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది.

ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మంచి ఫేమ్ వచ్చినా, మళ్లీ రీ-ఎంట్రీ ఎందుకు ఇచ్చావు? అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా మారింది. "నాకూ ఇప్పుడు అనిపిస్తుంది... అనవసరంగా రీ-ఎంట్రీ ఇచ్చానేమో అని. కానీ వచ్చిన ప్రతి ఛాన్స్‌ని ఉపయోగించుకోవాలి అనే ఫీలింగ్ అప్పట్లో ఉంది. లక్ష్మీదేవి తలుపు తట్టితే ఎవరు వదులుకుంటారు? అలాగే నాకు కూడా బిగ్‌బాస్ అంటే చాలా ఇష్టం. ఐదో వారంలో ఎలిమినేట్ అయ్యాక చాలా మంది ఆడియన్స్ నన్ను మళ్లీ హౌస్‌లో చూడాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోరారు. వాళ్ల కోసమైనా వెళ్లాలి కదా అన్న ఉద్దేశంతోనే రీ-ఎంట్రీ ఇచ్చాను. కానీ తిరిగి వెళ్లాక జరిగిన పరిస్థితులు చూసి మాత్రం... వెళ్లకుండా ఉండాల్సిందని ఇప్పుడు అర్థమైంది," అంటూ నిజాయితీగా ఒప్పుకుంది.

తర్వాత BB Jodi అవకాశంపై కూడా మాట్లాడింది శ్రీజ. 'డాన్స్ కాంపిటీషన్ చిన్న విషయం కాదు. నిజం చెప్పాలంటే నాకు డాన్స్ రాదు. కానీ ఈశ్వర్ ద్వారా అయినా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎంటర్ అయ్యాను. అక్కడ నైనిక, శ్రేష్ఠి, మానస్ లాంటి టాప్ డ్యాన్సర్లు ఉన్నారు. నా పార్ట్నర్ చైతు నాకు చాలా సపోర్ట్ చేశాడు. కేవలం రెండు రోజుల్లోనే రెండు పర్ఫార్మెన్సులు నేర్చుకుని స్టేజ్‌పై చేయగలిగాను. ఆ సమయంలో 'నేను కూడా చేయగలను' అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే నాకు పెద్ద అచీవ్‌మెంట్,'అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.

More from Filmibeat

Read more about: srija bigg boss telugu bb jodi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X