Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ చెత్త నిర్ణయం.. ఆమెను గెలిపించే కుట్ర.. లాజిక్‌తో బయటపడ్డ మోసం

సాధారణంగా బుల్లితెరపై వచ్చే అన్ని రకాల షోలకూ ప్రేక్షకాదరణ లభించదు. అలాంటిది అసలేమాత్రం పరిచయం లేని కంటెంట్‌తో వచ్చి సంచలనాలు సృష్టించింది బిగ్ బాస్. అందుకే ఇది వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ ఇప్పుడు ఏడో దాన్ని జరుపుకుంటోంది. ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని నిర్వహకులు ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టాస్క్ విషయంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం అనుమానాలను రేకెత్తిస్తోంది. ఏమైందో మీరే చూసేయండి!

ఏడో సీజన్‌లోని మూడో పవర్ అస్త్ర కోసం పోటీ పడే కంటెండర్లకు చాలెంజర్ల నుంచి అభ్యంతరాలు రావడంతో వాళ్లకు టాస్కులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజా ఎపిసోడ్‌లో శోభా శెట్టికి బిగ్ బాస్ 'స్పైసీ చికెన్ ఈటింగ్ టాస్క్'ను ఇచ్చాడు. ఇందులో భాగంగా కారంగా ఉన్న 45 చికెన్ ముక్కల్లో వీలైనన్ని ఎక్కువగా తినాలని ఆమెకు చెప్పాడు.

Bigg Boss Decision in Spicy Chicken Eating Task Creates Doubts

టాస్కులో భాగంగా శోభా శెట్టి బాధను దిగమింగుకుంటూ కారం ఉన్నా చికెన్ పీస్‌లను ఒక్కొక్కటిగా తింటూ వచ్చింది. ఒక సందర్భంలో కారం భరించలేక 'నా లైఫ్‌లో ఇంత కారం ఎప్పుడూ తినలేదు బిగ్ బాస్. షోలో ఏడవను అని మా అమ్మకు మాటిచ్చాను. కానీ ఏడుస్తున్నాను. నన్ను స్ట్రాంగ్‌గా చేస్తున్న మీకు థ్యాంక్స్' అంటూ ఓ రేంజ్‌లో ఎమోషనల్ అయిపోయింది.

మొత్తానికి చాలా సమయం తీసుకుని మరీ 27 చికెన్ పీస్‌లను శోభా శెట్టి పూర్తిగా తినేసింది. దీంతో ఆమెను చాలెంట్ చేసిన పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్‌లకు కూడా ఇదే టాస్కును బిగ్ బాస్ ఇచ్చాడు. అంతేకాదు, ఎవరైతే తక్కువ సమయంలో 28 చికెన్ పీస్‌లను తినేస్తారో వాళ్లు శోభా స్థానంలో పవర్ అస్త్ర టాస్కులో కంటెండర్ అవుతారని బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

ఈ టాస్కులో భాగంగా పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్‌లు చికెన్ పీస్‌లను తినడం మొదలు పెట్టారు. వీళ్లంతా కారం ఉన్నా శోభా శెట్టి అంత బాధ పడకుండా టాస్కును పూర్తి చేసేందుకు పోటీ పడ్డారు. మొత్తానికి గౌతమ్ కృష్ణ అందరి కంటే ముందుగానే 28 చికెన్ పీస్‌లు తిన్నాడు. అయితే, ఒక దాన్ని కంప్లీట్‌గా తినలేదని చెప్పిన సంచాలక్ సందీప్.. అతడినే విజేతగా ప్రకటించాడు.

Bigg Boss Decision in Spicy Chicken Eating Task Creates Doubts

సంచాలకుడు సందీప్ చెప్పిన దాని ప్రకారం.. ఈ టాస్కులో శోభా శెట్టి కంటే గౌతమ్ కృష్ణనే త్వరగా టాస్కును ఫినీష్ చేశాడు. దీంతో అతడు కంటెండర్ అయ్యాడని తెగ సంతోషపడ్డాడు. కానీ, బిగ్ బాస్ మాత్రం 28 చికెన్ పీస్‌లు పూర్తిగా తింటేనే గెలిచినట్లు అని ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు, గౌతమ్ ఆ టాస్కును పూర్తి చేయకపోవడంతో శోభా శెట్టిని విజేతగా ప్రకటించి కంటెండర్ చేశాడు.

ఇక, ఈ విషయంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అన్నప్పుడు గౌతమ్‌ను కాకుండా శోభాను ఎలా విజేతగా ప్రకటించాడో అర్థం కాలేదు. పైగా గౌతమ్ తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా టాస్క్ పూర్తి చేశాడు. అది కూడా శోభా కంటే తక్కువ సమయంలోనే కంప్లీట్ చేశాడు. అప్పుడు గౌతమ్ గెలవకున్నా ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించాలి కదా. కానీ, శోభాకే బిగ్ బాస్ మొగ్గు చూపాడు. దీంతో ఆమెను గెలిపించేందుకు కుట్ర చేసినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X