twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: మరో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. షో చరిత్రలోనే తొలిసారి.. ఈ సారి విజేత ఎవరంటే!

    |

    ఊహకే అందని ట్విస్టులు.. సరికొత్త టాస్కులతో సాగుతూ ప్రేక్షకులకు ఆద్యంతం మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే అంచనాలు లేకుండానే వచ్చి ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అదే సమయంలో భారీగా రేటింగ్‌ను అందుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ వరుస షాక్‌లు ఇస్తున్నాడు. అలాగే, ఈ వారం కెప్టెన్సీ టాస్కులో ఎవరు గెలిచారో చూద్దాం పదండి!

    ట్విస్టులతో పుంజుకుంటోంది

    ట్విస్టులతో పుంజుకుంటోంది

    సాధారణంగా తెలుగులో వచ్చే బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుంటుంది. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. కానీ, ఆరో సీజన్‌కు ఆరంభం నుంచే ఆదరణ అంతగా రావడం లేదు. దీంతో మూడు నాలుగు వారాలుగా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో షోను రంజుగా మార్చేశారు. ఫలితంగా ఇది రేటింగ్‌లో పుంజుకుంటోంది.

    ఆ హీరోపై యాంకర్ విష్ణుప్రియ దారుణ కామెంట్స్: 'చూస్తే నలిపేయడమే' అంటూ మేటర్ లీక్ చేయడంతో!ఆ హీరోపై యాంకర్ విష్ణుప్రియ దారుణ కామెంట్స్: 'చూస్తే నలిపేయడమే' అంటూ మేటర్ లీక్ చేయడంతో!

    కెప్టెన్సీ టాస్కులోనూ కొత్తగా

    కెప్టెన్సీ టాస్కులోనూ కొత్తగా

    బిగ్ బాస్ షోలో గెలిచిన విజేతకు రూ. 50 లక్షలు ప్రైజ్ మనీని అందిస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే, ఆరో సీజన్‌లో మాత్రం ఈ వారం కొన్ని టాస్కులను ఇచ్చి ఆ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. ఇలా ఇప్పటికే దాన్ని 44,00,300 రూపాయలు చేశారు. ఈ క్రమంలోనే గత ఎపిసోడ్‌లో 'బీబీ ట్రాన్స్‌పోర్ట్' అనే టాస్కు ఇచ్చి ఈ మొత్తం మళ్లీ తగ్గిస్తామని బిగ్ బాస్ చెప్పాడు.

    వాళ్ల మధ్య గొడవలతో టాస్క్

    వాళ్ల మధ్య గొడవలతో టాస్క్

    'బీబీ ట్రాన్స్‌పోర్ట్' టాస్కులో భాగంగా ముందుగా ఒకరు వెహికల్‌కు ఉన్న హారన్‌ను ప్రెస్ చేయాలి. మిగిలిన వాళ్లంతా కలిసి కెప్టెన్సీ రేసు నుంచి ఇద్దరిని తీసేయడానికి సెలెక్ట్ చేయాలి. హారన్ ప్రెస్ వేసిన కంటెస్టెంట్.. వాళ్లిద్దరిలో ఒకరిని టాస్కు నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఇక, ఈ టాస్కు మొత్తం గొడవలతో సాగింది. రాజ్ - ఇనాయా, శ్రీహాన్ - కీర్తి మధ్య బాగానే వాగ్వాదాలు జరిగాయి.

    అతి దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: ఏమీ దాచుకోకుండానే హాట్ షోఅతి దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: ఏమీ దాచుకోకుండానే హాట్ షో

    ఎలిమినేట్ అయింది ఎవరు

    ఎలిమినేట్ అయింది ఎవరు

    'బీబీ ట్రాన్స్‌పోర్ట్' టాస్కులో భాగంగా ముందుగా ఆది రెడ్డి హారన్ ప్రెస్ చేయగా.. ఆ రౌండ్‌లో ఫైమాను ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత రేవంత్ హారన్ కొట్టగా.. రాజ్‌ను ఎలిమినేట్ చేశారు. అనంతరం రోహిత్ గెలవగా.. శ్రీ సత్యను ఎలిమినేట్ చేశారు. తర్వాత శ్రీహాన్ హారన్ కొట్టగా.. కీర్తిని ఎలిమినేట్ చేశారు. చివర్లో ఇనాయా హారన్ కొట్టడంతో మెరీనా టాస్కు నుంచి ఔట్ అయింది.

    కెప్టెన్సీ రేసులో ఉన్నది వీళ్లే

    కెప్టెన్సీ రేసులో ఉన్నది వీళ్లే

    ఆసక్తికరంగా సాగిన 'బీబీ ట్రాన్స్‌పోర్ట్' టాస్కులో విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఇందులో అర్హత ఉన్న వాళ్లు ఎలిమినేట్ అయి.. లేని వాళ్లు పోటీలో నిలిచినట్లు కొందరు మాట్లాడారు. ఇక, ఇందులో మొత్తం ఐదుగురు సభ్యులు ఆది రెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనాయా సుల్తానాలు కంటెండర్లుగా నిలిచారు. వీళ్లే గురువారం జరిగే కెప్టెన్నీ టాస్కులో పోటీ పడబోతున్నారు.

    సీతా రామం హీరోయిన్ హాట్ షో: సినిమాలో పద్దతిగా.. అందులో మాత్రం!సీతా రామం హీరోయిన్ హాట్ షో: సినిమాలో పద్దతిగా.. అందులో మాత్రం!

    లీకైన మేటర్.. కెప్టెన్ అతడే

    లీకైన మేటర్.. కెప్టెన్ అతడే

    ఆరో సీజన్‌లోని 11వ వారానికి సంబంధించి జరిగే కెప్టెన్సీ టాస్కు ఫుల్ బాల్ ఆట మాదిరిగా ఉండనుంది. ఒక పెద్ద బాల్‌ను మిగిలిన పోటీ దారుల గోల్ పోస్టులోకి పంపితే వాళ్లు ఎలిమినేట్ అవుతారు. అలా చివరికి ఎవరు మిగులుతారో వాళ్లే ఈ వారం కెప్టెన్ అవబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో రేవంత్ గెలిచి హౌస్‌కు రెండోసారి కెప్టెన్ అయ్యాడట.

    లాస్ట్‌కి అన్ని లక్షలు తగ్గింది

    లాస్ట్‌కి అన్ని లక్షలు తగ్గింది

    ఇమ్యూనిటీ టాస్క్ తర్వాత 44,00,300 రూపాయలకు తగ్గిపోయిన ప్రైజ్ మనీ.. 'బీబీ ట్రాన్స్‌పోర్ట్' టాస్కు తర్వాత మరింతగా తగ్గింది. ఇందులో పలు రౌండ్లలో కొంత కొంత మొత్తాన్ని తగ్గించిన బిగ్ బాస్.. మొత్తంగా ఈ టాస్కు పూర్తయ్యే సరికి రూ. 3 లక్షలు కోత పెట్టాడు. అంటే.. ఇప్పుడు బిగ్ బాస్ ప్రైజ్ మనీ 41,00,300 రూపాయలకే చేరింది. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు.

    English summary
    Bigg Boss Telugu 6th Season Running Successfully. Revanth Wins Captaincy Task and Bigg Boss Decrease Winner Prize Money in Recent Episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X