‘నాకు అలాంటి మొగాళ్లంటే ఇష్టం.. నన్ను ఒళ్లో కూర్చొబెట్టుకొని అలా చేయాలి’
బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ కాస్తా గుర్తింపును దక్కించుకుంది బిగ్ బాస్ దివి వాద్య. తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ద్వారా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మరోవైపు వెండితెరపై 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ మహర్షి చిత్రంలో చిన్న పాత్ర పోషించి వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ చిత్రంతోనే సినీ రంగంలో అడుగు పెట్టింది. అప్పటి నుంచి సినిమాలు, టీవీ రంగంలో యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. మరోవైపు తనకు సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో మెరుస్తూ సందడి చేస్తోంది. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా తనకు కాబోయే లైఫ్ పార్ట్ నర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడుతూ వచ్చింది...
దివి వాద్య గురించి..
నటి దివి వాద్య హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. 1996 మార్చి 15లో పుట్టిన దివి వాద్యా హైదరాబాద్ లోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. ఆమె తల్లిదండ్రలు శశికాంత్ వాద్య, దేవకీ. దివి తన 10వ తరగతి వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లోనే చదువుకుంది. ఇక జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో ఎంబీఏ పూర్తి చేసి పట్టా పొందింది. ఆ తర్వాతన తనకు నటన, మోడలింగ్ పై ఉన్న ఆసక్తిని కనబరిచ్చింది.

తన బాయ్ ఫ్రెండ్ గురించి..
దివి వాద్య గత ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అయిన సంగతిని తెలియజేసిన సంగతి తెలిసిందే. వైజాగ్ కు చెందిన అబ్బాయితో ఆమె ప్రేమలో పడిందని, ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పెద్దగా డేటింగ్, లవ్ పై తను ఏమాత్రం ఆసక్తి లేదని గత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక తాజాగా తనకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టమో, తనకు ఎలా చూసుకునే అబ్బాయిని లైఫ్ పార్ట్ నర్ గా చేసుకోవాలని అనుకుంటోందో చెప్పుకొచ్చింది.
దివి వాద్య కామెంట్స్..
రీసెంట్ గా దివి వాద్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భాగస్వామి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తనను ఎంతో గారాబంగా చూసుకునే వారు కావాలని చెప్పుకొచ్చింది. తనతో ఎంతో ఫ్రెండ్లీగా, ఎప్పుడు చిన్న పిల్లలా చూసుకునే వారంటే ఇష్టమని చెప్పింది. ముఖ్యంగా దివి వాద్యను తన ఒళ్లో కూర్చొబెట్టుకొని లాలించే వారు కావాలని చెప్పుకొచ్చింది. అలాంటి క్వాలిటీస్ ఉన్న వారంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దివి వాద్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తను ప్రస్తుతం ఎవరితో డేట్ చేయడం లేదని, కానీ తనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కోసం వెతుకుతూనే ఉన్నానని చెప్పడం విశేషం.
దివి వాద్య సినిమాలు..
2017లోనే దివి వాద్య మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. మోడలింగ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకొని సినిమా రంగంలోనూ అవకాశాలు అందుకుంది. మహేశ్ బాబు మహర్షి, ఏ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్, గాడ్ పాధర్, లంబసింగి, పుష్ప 2, డాకూ మహారాజ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అలాగే తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్ గా వినోదాన్ని పంచింది.


Click it and Unblock the Notifications











