బుల్లి గౌనులో బిగ్ బాస్ దివి హాట్ షో.. సముద్రంలో బికినీకి మించిన రేంజ్ లో సోకుల విందు!

తెలుగులో అత్యధిక పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్​ బాస్​. ఈ రియాలిటీ షో వల్ల అనేక మంది చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో ఒకరే సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యా. బిగ్​ బాస్​ తెలుగు నాలుగో సీజన్​లో అడుగు పెట్టి సూపర్​ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. అయితే బిగ్​బాస్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ మహేశ్​ బాబు మహర్షి సినిమాలో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసిన ఈ భామకి అప్పుడు చెప్పుకునేంత పేరు రాలేదు. కానీ బిగ్ బాస్ ఫేమ్ తో మాత్రం వరుసగా సినీ అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ గా అందాల విందు చేస్తూ మరింత పాపులర్ అవుతోంది దివి వాద్యా.

అనేక చిత్రాల్లో హీరోయిన్ గా

అనేక చిత్రాల్లో హీరోయిన్ గా

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సూపర్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ దివి వాద్యా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామ 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయింది. అనంతరం 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.

గ్లామరస్ బ్యూటికి రాని గుర్తింపు..

గ్లామరస్ బ్యూటికి రాని గుర్తింపు..

ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలోనే సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసే అవకాశం లభించింది. మహర్షి సినిమా ఎలాంటి హిట్ టాక్ తెచ్చుకుందో తెలిసి. కానీ దివి వాద్యా మాత్రం ఫేమస్ కాలేకపోయింది. ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం సరైనా గుర్తింపు దక్కలేదు.

ఊహించని విధంగా..

ఊహించని విధంగా..


వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు రావట్లేని పరిస్థితుల్లోనే ముద్దుగుమ్మ దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది. కానీ ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

వర్కౌట్ కానీ భోళా శంకర్..

వర్కౌట్ కానీ భోళా శంకర్..


దివి వాద్యా మధ్యలోనే ఎలిమినేట్ అవ్వడంపై బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ నిర్వహకులపై అప్పుడు పలు విమర్శలు సైతం వెల్లువెత్తాయి. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా దివి వాద్యాకు మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆమె అందానికి ఫిదా అయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ సీజన్ ఫినాలే సమయంలో 'భోళా శంకర్' సినిమాలో అవకాశం ఇస్తున్నట్లుగా స్టేజీపైనే ప్రకటించారు. కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు కానీ, దానికంటే ముందే గాడ్ ఫాదర్ చిత్రంలో అవకాశం ఇచ్చారు.

ఏటీఎమ్ వెబ్ సిరీస్ తో..

ఏటీఎమ్ వెబ్ సిరీస్ తో..


చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన దివి వాద్యా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలా బిగ్ బాస్ షో తర్వాత దివి వాద్యా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2 వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. ఇప్పుడు తాజాగా ఏటీఎం అనే వెబ్ సిరీస్ తో మరోసారి అలరించేందుకు సిద్ధంగా ఉంది ఈ బిగ్ బాస్ అందం.

హాట్ ఫొటోలు, వీడియోలతో..

హాట్ ఫొటోలు, వీడియోలతో..


సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది ఈ బిగ్ బాస్ భామ దివి వాద్యా. అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో యూత్ ను తనవైపు ఆకర్షిస్తోంది. ఇలా హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్యం హాట్ టాపిక్ గా మారుతోన్న దివి వాద్యా గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది. అలాగే తన కెరీర్ కు సంబంధించిన సినీ విశేషాలు, ఈవెంట్స్ వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. జనవరి 20న విడుదల కాబోయే ఏటీఎమ్ వెబ్ సిరీస్ గురించి కూడా అలాగే షేర్ చేసింది.

సూర్యుడి తాకిడికి..

ఇక నిత్యం హాట్ ఫొటోలతో సందడి చేసే గ్లామరస్ బ్యూటి దివి వాద్యా తాజాగా మరోసారి అలాంటి హాట్ పిక్స్ ను షేర్ చేసింది. రెడ్ కలర్ బుల్లి గౌనులో తన అందాలను ఆరబోసింది. సముద్రంలో ఓడపై కూర్చున్న దివి తన థైస్ తోపాటు ఎదపై ఉన్న టాటూను హాట్ గా ప్రదర్శించింది. టూ పీస్ డ్రెస్రులో హై గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఇసుక తిన్నెల్లో ఓడపై కూర్చున్న దివి వాద్యా అందాలు సూర్యుడి తాకిడికి మరింత మెరుస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X