Don't Miss!
- Finance
Amazon Air: వాయువేగంతో అమెజాన్ డెలివరీలు.. హైదరాబాద్ కేంద్రంగా.. కేటీఆర్ ఏమన్నారంటే..
- News
నా గోస ఎవరికీ రావొద్దురో అయ్యో! అయ్యప్ప: నవ్వులు పూయిస్తున్న బుడ్డోడి వీడియో
- Lifestyle
ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగండి! దాని ఫలితం అద్భుతం!!
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Sports
INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
షర్ట్ విప్పేసి మరి బిగ్ బాస్ దివి అరాచకం.. బ్రాలో హీట్ పెంచేలా అందాలు, వీడియో వైరల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాలో చిన్న రోల్ లో తళుక్కుమన్న సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యా.. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల యమ పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో అంతకుమించిన ఫేమ్ దక్కించుకుంది ఈ సొగసరి. ఫలితంగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు అందుకుంటూ సినీ కెరీర్ లో జోరుగా ముందుకు సాగుతోంది. తాజాగా ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ దివి వాద్యా తాజాగా హాట్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో దివి అందాలు నెటిజన్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.

పలు సినిమాలతో అలరించి..
తెలుగులో అత్యధిక పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్ బాస్. ఈ రియాలిటీ షో వల్ల అనేక మంది చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో ఒకరే సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యా. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అడుగు పెట్టి సూపర్ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇందులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా పలు సినిమాల్లో నటించి అలరించింది.

మహేశ్ బాబుతో మెరిసి..
సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ సొట్ట బుగ్గుల వయ్యారి దివి వాద్యా. గ్లామర్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామ 'లెట్స్ గో' అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సినిమాతో పాటు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసే అవకాశం లభించింది.

సినిమా హిట్ అయినా రాని పేరు..
మహేశ్ బాబు మహర్షి సినిమాలో నటించిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దివి వాద్యాకు మాత్రం అంతగా కలిసి రాలేదు. ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం సరైనా గుర్తింపు దక్కలేదు.

పెద్దగా పడని ప్రభావం..
అయితే అచ్చమైన తెలుగు అందం దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల సుందరి తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది. కానీ తన ఆట తీరు ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయేసరికి ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

చిరంజీవి సినిమాలో కీ రోల్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు వరుసగా సినీ ఆఫర్స్ రావడం మొదలైంది. ఇందులో భాగంగానే 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2 వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. అంతేకాకుండా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది దివి. అందులో దివి నటనకు మంచి మార్కులు సైతం పడ్డాయి.

హాట్ ఫొటోలు వదులుతూ..
ఇక తాజాగా ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది బిగ్ బాస్ దివి వాద్యా. డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందించిన ఈ వెబ్ సిరీస్ ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పించారు. ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించాడు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది బిగ్ బాస్ బ్యూటి దివి వాద్యా. అందులో భాగంగానే హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ హైలెట్ అవుతోంది.

షర్ట్ విప్పేసి మరి..
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తున్న బిగ్ బాస్ అందం దివి వాద్యా తాజాగా ఒక వీడియో వదిలింది. ఈ వీడియోలో షర్ట్ బటన్స్ విప్పేసి మరి తన ఎద అందాలను హాట్ గా ప్రదర్శించింది సొట్ట బుగ్గల సుందరి. బ్లాక్ కలర్ బ్రా వేసుకున్న దివి వాద్యా ఎదపై ఉన్న టాటూ నెటిజన్లు అట్రాక్ట్ చేస్తోంది. ఈ వీడియోలో దివి చేసిన పరువాల విందుకు సోషల్ మీడియా యూజర్స్ ఫిదా అవుతున్నారు.