కొత్త టాటూతో దివి దర్శనం.. మళ్లీ అదే చోట అంతా కనిపించేలా.. అతనితో వీడియో!

ఇటీవల సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతున్న ముద్దుగుమ్మల్లో బిగ్ బాస్ ఫేమ అండ్ స్టన్నింగ్ బ్యూటి దివి వాద్యా ఒకరు. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాలో చిన్న రోల్ లో తళుక్కుమన్న ఈ సొట్ట బుగ్గల సుందరి బిగ్ బాస్ నాలుగో సీజన్ వల్ల వల్ల సూపర్ పాపులర్ అయిపోయింది.

ప్సస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో అంతకుమించిన ఫేమ్ దక్కించుకుంది ఈ సొగసరి. ఇప్పటికే తన ఎదపై టాటూను వేయించుకున్న ఈ బ్యూటి తాజాగా మరొక టాటూతో దర్శనం ఇవ్వనుంది. అందుకు సంబంధించిన వీడియో పెట్టి క్యూరియాసిటీ పెంచింది.

అత్యధిక పాపులారిటీ..

అత్యధిక పాపులారిటీ..

తెలుగులో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్​ బాస్​. అనేక మంది చిన్న ఆర్టిస్టులు, చిన్న పాత్రల్లో మెరిసిన నటీనటులు ఈ షోలో పాల్గొనడంతో పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ దివి వాద్యా ఒకరు. బిగ్​ బాస్​ తెలుగు నాలుగో సీజన్​లో అడుగు పెట్టి సూపర్​ పాపులర్ అయింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా పలు సినిమాల్లో నటించి అలరించింది.

షార్ట్ ఫిల్మ్ ద్వారా..

షార్ట్ ఫిల్మ్ ద్వారా..

అయితే ఈ స్టన్నింగ్ బ్యూటి దివి వాద్యా సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో అనేక మంది దృష్టిని ఆకర్షించిన ఈ వయ్యారి భామ 'లెట్స్ గో' అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సినిమాతో పాటు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసే అవకాశం లభించింది.

వారిసు డైరెక్టర్ దర్శకత్వంలో..

వారిసు డైరెక్టర్ దర్శకత్వంలో..

విజయ్ వారసుడు మూవీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి సినిమాలో నటించిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు పెద్దగా ఒరిగిందిలేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దివి వాద్యాకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఇలా ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం సరైనా ఫేమ్ రాలేదు.

 ఊహించని విధంగా..

ఊహించని విధంగా..

పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే అచ్చమైన తెలుగు అందం దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల సుందరి తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది.

అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది. కానీ తన ఆట తీరు ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయేసరికి ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

చిరంజీవి సినిమాతో మంచి మార్కులు..

చిరంజీవి సినిమాతో మంచి మార్కులు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు వరుసగా సినీ ఆఫర్స్ రావడం మొదలైంది. ఇందులో భాగంగానే 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. అంతేకాకుండా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది దివి. అందులో దివి నటనకు మంచి మార్కులు సైతం పడ్డాయి.

అన్ని అందాలు చూపిస్తూ..

అన్ని అందాలు చూపిస్తూ..

సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న దివి వాద్యా ఐటమ్ బాంబ్ అవతారం కూడా ఎత్తింది. సీనియర్ హీరో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న రుద్రంగి మూవీలో ఒక ఐటమ్ సాంగ్ చేసింది దివి వాద్యా. జాజిమొగులాలి అంటూ సాగే ఫోక్ సాంగ్ ను ఇందులో రీమేక్ చేశారు. ఈ పాటలో తన నాభి, నడుము, ఎద అందాలతో సూపర్ హాట్ గా అలరించింది. ఫలితంగా ఆ వీడియో విడుదలైన అతి తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఎదపై మరోక టాటూతో..

ఎదపై మరోక టాటూతో..

సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉండే దివి వాద్యా హాట్ ఫొటోలు, వీడియోలు పెడుతూ ఉంటోంది. అందులో ఎక్కువగా తన ఎదపై ఉన్న టాటూ ఫోకస్ అయ్యేలా పెడుతూ యూత్ ను రెచ్చగొడుతుంటుంది. ఇప్పుడు తాజాగా ఎదపై ఆ టాటూ పక్కనే మరొక టాటూ వేసుకోనుంది ఈ సుందరి. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా షేర్ చేసింది. అందులో దివి వాద్యాతో పాటు లోబో కూడా ఉన్నాడు. అంటే ఆ టాటూను లోబోనే వేయనున్నాడని అర్థం అవుతోంది. ఇందులో బ్రాలో దర్శనం ఇచ్చిన దివి ఎద అందాలు హాట్ గా ఎక్స్ పోజ్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X