బాడీగార్డ్స్ ముందే నా నడుము గిల్లిన తుంటరి.. వాడికి అలా బుద్ధి చెప్పా... బిగ్‌బాస్ దివి

సెలబ్రిటీలు పబ్లిక్‌గా బయటకు రావడానికే భయపడే పరిస్ధితులు నెలకొన్నాయి. ఫ్యాన్స్ అత్యుత్సాహం ఒక కారణమైతే.. ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిల దారుణాలు మరో కారణం. ఇక హీరోయిన్ల సంగతి మరింత దారుణం. అసభ్యంగా తాకుతూ.. మీద మీదకి దూసుకొస్తూ అమ్మాయిలను విసిగిస్తున్నారు. ఇటీవల మలయాళ హీరోయిన్ హనీరోజ్‌ని కొందరు ఆకతాయిలు ఏడిపించగా.. సీనియర్ నటి మంజు వారియర్‌‌ను కొందరు ముద్దుపెట్టుకోబోయారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో మూల జరుగుతుండటంతో పబ్లిక్ ప్లేస్‌లో సినిమా ఈవెంట్స్ నిర్వహించాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ ఫేమ్, నటి దివి వైద్య తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'స్టార్ హీరో కొడుక్కి హీరోయిన్‌‌గా... ఆ తప్పుతో నా కెరీర్ నాశనం’
'స్టార్ హీరో కొడుక్కి హీరోయిన్‌‌గా... ఆ తప్పుతో నా కెరీర్ నాశనం’

హైదరాబాద్‌కు చెందిన దివి వైద్య.. ఎంటెక్ పూర్తి చేసిన అనంతరం మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేశారు. పలు టాప్ కంపెనీలకు మోడల్‌గా పనిచేశారు. సినిమాలపై ఆసక్తితో తొలుత షార్ట్ ఫిలింస్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. 2019లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన మహర్షి చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు దివి. అనంతరం ఏ1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్ స్టోరీస్, నయీమ్ డైరీస్, జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రాంగి, లంబసింగి, సింబా, పుష్ప 2, డాకు మహారాజ్, హనీ తదితర సినిమాలలో నటించింది దివి.

Bigg Boss Divi Vadthya Reveals Shocking Incident at Public Event

అయితే చాలా సినిమాలలో అవకాశాలు కోల్పోయానని, అలాగే కొన్ని సినిమాలలో తన పాత్ర పరిధి తగ్గించారని దివి వైద్య పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో దివి కీలకపాత్రలో నటించింది. ఏకంగా తన క్యారెక్టర్ పైనే టీజర్ మొత్తం నడిచింది. దీని కోసం 20 రోజులు షూటింగ్‌కి వెళ్లి.. 10 రోజులు డబ్బింగ్ చెప్పాను, చాలా బాగా నడిచింది.. సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ తీరా పుష్ప 2 రిలీజ్ అయ్యాక అసలు విషయం తెలిసింది. మా ఫ్రెండ్స్‌ 10 మందిని తీసుకుని థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి షాకయ్యా. టీజర్‌లో చూపించిన సీన్‌లో ఏ ఒక్కటి లేకపోవడం దివిని బాధపెట్టింది.

Recommended For You
పెళ్లయిన యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బుట్టబొమ్మ
పెళ్లయిన యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బుట్టబొమ్మ

ఇదిలాఉండగా... పబ్లిక్ ప్లేస్‌లో తనకు ఎదురైన దారుణ ఘటన గురించి ఓ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో చెప్పుకుని బాధపడింది దివి వైద్య. ఓ పబ్ ఈవెంట్‌కు నన్ను పిలిచారు. నన్ను లోపలికి తీసుకెళ్లే సమయంలో చుట్టూ జనం ఉన్నారు. దాంతో నాకు రక్షణగా బాడీగార్డ్స్ నిలబడి జాగ్రత్తగా వేదిక మీదకి తీసుకెళ్తారు. చుట్టూ అంతమంది జనం, బాడీగార్డ్స్ ఉన్నప్పటికీ ఒకడు నా నడుము గిల్లాడు. ఆ పరిణామంతో నేను షాకయ్యా. అతను చేసినదంతా చేసి.. ఏం తెలియనట్లు అమాయకంగా నన్ను చూస్తూ నిలబడ్డాడు. నేను వెంటనే వాడిపై సీరియస్ అయి.. తలపై గట్టిగా కొట్టి బాడకమ్ అని తిట్టేశా.

You May Also Like
ఆ 10 నిమిషాల్లో పాయల్ రాజ్‌పుత్‌‌కు ముచ్చెమటలు
ఆ 10 నిమిషాల్లో పాయల్ రాజ్‌పుత్‌‌కు ముచ్చెమటలు

అప్పుడు నేను కనుక రియాక్ట్ కాకపోతే అతను చేసిన పనిని అనుమతించినట్లు.. అలా జరిగిఉంటే ఫీల్ అయ్యేదానిని. అందుకే వెంటనే ఇచ్చిపడేశా. అయినా ఇక్కడ నేను తప్పు చేసినట్లు కాదు. చుట్టూ అంతమంది జనం, బాడీగార్డ్స్ ఉన్నప్పటికీ అతను నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జరగడానికి ముందు వరకు చాలా ఫ్రీగా ఉన్నా. కానీ ఆ తర్వాతి నుంచి చేతులతో నా శరీరాన్ని కవర్ చేసుకుంటూ నడిచానని దివి విద్య వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మంచి పనిచేశావ్, బాగా బుద్ధి చెప్పావంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: bigg boss divi vadthya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X