స్వర్గానికి దారి చూపిస్తా... రెచ్చగొట్టే పోస్ట్‌తో బిగ్‌బాస్ దివి కలకలం

బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. తేనే కళ్లు, హీరోయిన్లను మించిన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంటారు దివి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ ప్రోగ్రామ్‌లతో హల్‌చల్ చేస్తోంది ఈ ముద్దగుమ్మ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దివి వైద్య తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన దివి వైద్య.. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేశారు. పలు టాప్ కంపెనీలకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు. తొలుత షార్ట్ ఫిలింస్‌లో నటించిన దివివైద్య.. 2019లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన మహర్షి చిత్రంలో తళుక్కున మెరిశారు. ఈ దశలో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం రావడంతో దివి జీవితాన్ని మలుపు తిప్పింది. తన ఆటతీరు, అందం, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల ఆదరణను పొందింది. బిగ్‌బాస్ ఫైనల్‌కు గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైతం దివి టాలెంట్‌కు ముచ్చటపడి తన సినిమాలో అవకాశం కల్పించారు.

Bigg Boss Divi Vadthya s Latest Gym Workout Photos Go Viral

బిగ్‌బాస్‌తో బాగా పాపులారిటీ రావడంతో సినిమాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు దొరికాయి. ఏ1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్ స్టోరీస్, నయీమ్ డైరీస్, జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రాంగి, లంబసింగి, సింబా, పుష్ప 2, డాకు మహారాజ్, హనీ తదితర సినిమాలలో నటించింది దివి. పుష్ప, డాకు మహారాజ్ సినిమాల తర్వాతి నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశం దక్కించుకుంటూ చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటోంది. చిన్నా చితకా పాత్రలు కాకుండా మంచి క్యారెక్టర్లు పడాలని ఆమె కోరుకుంటున్నారు. పలు ఇంటర్వ్యూలలో ఈ విషయంపై తన ఆవేదనను బయటపెట్టారు దివి. పుష్ప 2 టీజర్ మొత్తంలో నేనే కనిపించినా.. సినిమాలో తన పాత్ర ఎక్కువసేపు ఉండకపోవడం బాధించిందని చెప్పుకొచ్చింది.

వయసు పెరుగుతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉండిపోయింది దివి. ఇటీవల ఓ షోకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, కానీ ఇప్పటి వరకు సరైన అబ్బాయి దొరకలేదని చెప్పింది. అసలు పెళ్లిపై తనకు నమ్మకం లేదని.. తన ఫ్రెండ్స్‌లో పెళ్లయిన వారిలో 90 శాతం మంది మ్యారేజ్ తర్వాత కొన్నాళ్లకే విడిపోయారు. పెళ్లయిన వారిలో స్వేచ్ఛ, సంతోషం కనిపించడం లేదని ఇదంతా చూస్తుంటే పెళ్లిపై భయం వేస్తోంది. అసలు పెళ్లికంటే లివింగ్ రిలేషన్ ఉత్తమమని షాకింగ్ న్యూస్ చెప్పింది దివి. పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్‌ను అమితంగా ఇష్టపడే దివి ఆయనపై ఉన్న క్రష్‌ను పలుమార్లు బయటపెట్టింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దివి వైద్య.. తన సినిమాలు, షోలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో దివి షేర్ చేసిన ఫోటోలు, పోస్ట్‌ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ టైట్ ఫిట్‌తో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఫోటోలను దివి షేర్ చేశారు. స్వర్గానికి దారి చూపిస్తా వచ్చేయమంటూ రెచ్చగొట్టేలా రాసుకొచ్చింది. దానికి నెటిజన్లు వెరైటీగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: bigg boss divi vadthya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X