90 శాతం విడాకులు.. పెళ్లి కంటే రిలేషన్షిప్ బెటర్.. బిగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..
Divi Vadthya: బిగ్‌బాస్ తెలుగు సీజన్-4తో గుర్తింపు తెచ్చుకున్న నటి దివి వాద్య మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అటు అందం, ఇటు నటన రెండూ ఉన్నప్పటికీ సరైన బ్రేక్ దొరకక సినిమాల్లో ఇప్పటివరకు కొన్ని సైడ్ క్యారెక్టర్లకే పరిమితమైన దివి, మంచి అవకాశం కోసం ఆశతో సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ మాత్రం పెద్ద చర్చకు దారి తీశాయి. ఇటీవల యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షో లో దివి వాద్య ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఈ షోలో ప్రేమ, పెళ్లి, లివింగ్ రిలేషన్ వంటి వ్యక్తిగత అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆశ్చర్యానికి గురిచేశాయి.
మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌ను నేను నమ్మను
నీకు కాబోయే వాడు ఎలా ఉండాలి? అనే యాంకర్ వర్ష ప్రశ్నకు దివి చాలా ఓపెన్‌గా సమాధానం ఇచ్చింది. 'చాలా రోజులుగా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకలేదు. నిజానికి నాకు ఏం కావాలో, ఎలాంటి వ్యక్తి కావాలో కూడా క్లారిటీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌ను నేను నమ్మడం లేదు. దానికంటే లివింగ్ రిలేషన్ బెటర్ అని అనిపిస్తుంది' అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

నిజాయితీ ఉంటే పెళ్లి చేసినట్లే
లివింగ్ రిలేషన్‌పై తన అభిప్రాయాన్ని మరింత వివరించిన దివి... 'ఒక వ్యక్తితో నిజాయితీగా, కమిట్‌మెంట్‌తో ఉంటే అదే పెళ్లి చేసినట్టే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనిపై కొందరు నన్ను వ్యతిరేకించవచ్చు' అంటూ స్పష్టం చేసింది. అలాగే తన ఫ్రెండ్స్‌ను ఉదాహరణగా చూపిస్తూ,'పెళ్లయిన రెండు, మూడు సంవత్సరాలకే విడిపోయిన వాళ్లు నా ఫ్రెండ్ సర్కిల్‌లో దాదాపు 90 శాతం మంది ఉన్నారు' అని చెప్పింది.
పెళ్లి తర్వాత చాలామంది హ్యాపీనెస్ లాస్
పెళ్లి తర్వాత మారే రిలేషన్లపై దివి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'పెళ్లికి ముందు ఎంత హ్యాపీగా, ఫ్రీగా ఉంటామో... పెళ్లయ్యాక కూడా అలాగే ఉండాలి. కానీ చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు ఒకలా, పెళ్లయిన తర్వాత మరోలా మారిపోతున్నారు. చాలామంది పెళ్లి తర్వాత తమ సంతోషాలను కోల్పోతున్నారు'అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 'చాలామంది తమ పార్ట్నర్లకు సరైన రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఉద్యోగం, డబ్బుల కోసం సంబంధాలను దూరం చేసుకుంటున్నారు. అందుకే పెళ్లంటే నాకు భయం. పెళ్లి చేసుకోవాలా? లేదా? అనే సందేహంలోనే ఉన్నాను'అంటూ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది.
పెళ్లయితే అడ్జస్ట్ అవుతానా?
'పెళ్లయితే అడ్జస్ట్ అవుతావా?'అని యాంకర్ అడిగిన ప్రశ్నకు దివి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. 'అవుతాను... కానీ నా క్యారెక్టర్ డామేజ్ అయ్యేంతవరకు కాదు. నా ఇష్టాలను పూర్తిగా పక్కన పెట్టాల్సి వస్తే మాత్రం నేను చేయలేను. ఒకవేళ నన్నే తన లైఫ్‌గా చూసుకునే వ్యక్తి అయితే, అతనికోసం చాలా త్యాగాలు చేయడానికి సిద్ధమే'అని చెప్పింది. ఒక వేళ మ్యారేజ్ లైఫ్ సెట్ కాకపోతే ఏం చేస్తావు? అనే ప్రశ్నకు దివి ఇచ్చిన సమాధానం మరింత చర్చకు దారి తీస్తోంది. 'ఒకటి రెండు సంవత్సరాల తర్వాత సెట్ కాకపోతే, గొడవలు, తిట్టుకోవడం, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం ఎందుకు? దానికంటే విడిపోవడమే బెటర్. అనవసరంగా ఒకరి లైఫ్‌ని ఇంకొకరు నాశనం చేసుకోవడం వేస్ట్' అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
దివి వాద్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఏదేమైనా, పెళ్లి-లివింగ్ రిలేషన్ అంశంపై దివి చేసిన ఓపెన్ కామెంట్స్ టాలీవుడ్‌లోనే కాకుండా యువతలో కూడా పెద్ద చర్చకు కారణమయ్యాయి.


Click it and Unblock the Notifications











