హట్ షోలో డోస్ పెంచుతోన్న దివి వాద్యా.. క్యాజ్‌వల్ డ్రెస్సులోనూ అలా అంతా చూపిస్తే ఎలా?

తెలుగులో అత్యధిక పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్​ బాస్​. ఈ రియాలిటీ షో వల్ల అనేక మంది చిన్న ఆర్టిస్టులు పెద్ద సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో ఒకరే సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యా. బిగ్​ బాస్​ తెలుగు నాలుగో సీజన్​లో అడుగు పెట్టి సూపర్​ పాపులర్ అయింది ఈ గ్లామరస్ బ్యూటీ. అయితే బిగ్​బాస్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ మహేశ్​ బాబు మహర్షి సినిమాలో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసిన ఈ భామకి అప్పుడు చెప్పుకునేంత పేరు రాలేదు. కానీ బిగ్ బాస్ ఫేమ్ తో మాత్రం వరుసగా సినీ అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. అంతేకాకుండా ఎన్నడూ చూపించని విధంగా అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.

 బిగ్ బాస్ కంటే ముందుగా..

బిగ్ బాస్ కంటే ముందుగా..

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సూపర్ పాపులర్ అయిన వాళ్లలో బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయిల్లో దివి వాద్యా ఒకరు. అయితే బిగ్ బాస్ కు ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు మోడలింగ్ రంంగలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామ 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయింది. అనంతరం 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.

 సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా..

సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా..

వరుసగా పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది. మహర్షి సినిమా ఎలాంటి హిట్ టాక్ తెచ్చుకుందో తెలిసింగే. అయితే బ్యూటిఫుల్ దివి వాద్యాకు మాత్రం పెద్దగా ఒరిగింది లేదు. ఇలా ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం సరైనా గుర్తింపు దక్కలేదు.

షాక్ ఇచ్చిన దివి..

షాక్ ఇచ్చిన దివి..

వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు రావట్లేదని బాధపడుతున్న సమయంలో అందాల దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది. కానీ ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయి షాక్ ఇచ్చింది.

సినిమాలు, సిరీస్ ల్లో..

సినిమాలు, సిరీస్ ల్లో..

బిగ్ బాస్ నుంచి దివి వాద్యా మధ్యలోనే ఎలిమినేట్ అయిన మంచి పేరుతోనే బయటకు వచ్చింది. దీంతో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది దివి వాద్యా. ఇందులో సునీల్ కు భార్యగా మంచి నటన కనబర్చిన దివి వాద్యాకు ప్రశంసలు దక్కాయి. దీంతో పలు సినిమాలు, సిరీస్ లో అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.

ఐటమ్ సాంగ్ తో కూడా..

ఐటమ్ సాంగ్ తో కూడా..

దివి వాద్యా 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించిన ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో ముద్దు సీన్లతో రెచ్చిపోయింది దివి వాద్యా. అంతేకాకుండా రుద్రంగి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి కూడా అలరించింది. జాజిమొగులాలి అనే ఫోక్ సాంగ్ ను రీక్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

 పర్సనల్ విషయాలు..

పర్సనల్ విషయాలు..

ఇక సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది ఈ బిగ్ బాస్ భామ దివి వాద్యా. అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో యూత్ ను తనవైపు ఆకర్షిస్తోంది. ఇలా హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్యం హాట్ టాపిక్ గా మారుతోన్న దివి వాద్యా గతేడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది. అలాగే తన కెరీర్, పర్సనల్ కు సంబంధించిన సినీ విశేషాలు, ఈవెంట్స్ వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

హాట్ గా అంతా చూపిస్తూ..

హాట్ గా అంతా చూపిస్తూ..

ఇక నిత్యం హాట్ ఫొటోలతో సందడి చేసే గ్లామరస్ బ్యూటి దివి వాద్యా తాజాగా మరోసారి అలాంటి హాట్ పిక్స్ ను షేర్ చేసింది. టీ షర్ట్, పొట్టి నిక్కరు వేసుకున్న దివి వాద్యా హాట్ గా తన థైస్ ను ఎక్స్ పోజ్ చేసింది. బెంచిపై కూర్చుని బుక్ చదువుతున్నట్లు పోజు ఇచ్చిన దివి థైస్ షో చేస్తూ ఆకట్టుకుంటోంది. అలాగే మరొక స్లీవ్ లెస్ షార్ట్ డ్రెస్ లో థైస్ తోపాటు షోల్డర్ బ్యూటిని ప్రదర్శించింది. దివి వాద్యా సో హాట్ గా ఉన్న ఈ పిక్స్ ప్రజంట్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X